Reading Time: 2 minutes

స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి.. వాట్సాప్ ద్వారా లొకేషన్.. ఏడాదికి రూ.5 కోట్ల బిజినెస్ గుట్టు రట్టు

Caption of Image.

గంజాయి ముఠా టచ్ చేయని నెట్ వర్క్ లేదు.. వాడని టెక్నాలజీ లేదేమో అనిపిస్తుంది ఈ న్యూస్ చదివితే. పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధాలు, తనిఖీలు చేస్తుండటంతో స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠా ప్లాన్ చూసి పోలీసులు షాకయ్యారు. గురువారం (జులై 02) మెడిసిన్ ప్యాకెట్ల పేరుతో నడుస్తున్న దందా గుట్టు రట్టు చేశారుహైదరాబాద్ పోలీసులు. 

మెడిసిన్ పేరుతో గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా నెట్ వర్క్ ను ఛేదించారు హైదరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా, వాట్సాప్ ల ద్వారా ఆర్డర్స్ తీసుకుని దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.  షాకయ్యారు.

ALSO READ : రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు ఇస్తాం..  

21  రాష్ట్రాలకు గంజాయి: సీపీ సజ్జనార్

  • దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ ద్వారా గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశాం..
  • H- Fast అధికారులు, గుడిమల్కాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు..
  • గంజాయిని స్పీడ్ పోస్ట్ ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నారు..
  • జార్ఖండ్‌కు చెందిన సత్యం మిశ్రా అరెస్ట్ చేశాము..
  • సత్యం మిశ్రా ఇంటర్ చదివి పెయింట్ పని చేసి మానేశాడు..
  • ఆ తర్వాత లారీ డ్రైవర్ గా పనిచేశాడు..
  • 2018 లో గంజాయి కి అలవాటు పడ్డాడు..
  • రాహుల్ జై, సచిన్ మిశ్రా, సంతోష్ , మిశ్రా సిండికేట్ గా ఏర్పడి.. సొంత ఊరిలోనే గంజాయి పంట వేశారు..
  • ఊరిలో చాలా మందితో గంజాయి పంట పండించి కొనుగోలు చేసి కస్టమర్ లకి సరఫరా చేస్తున్నారు..
  • మరో నలుగురు నిందితులు రాహుల్ జై, సచిన్ మిశ్రా, సంతోష్ పండిడ్ పరారీలో ఉన్నారు..
  • స్పీడ్ పోస్ట్, కొరియర్ సేవల ద్వారా 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నారు..
  • హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు సహా పలు నగరాలకు గంజాయి సరఫరా చేస్తున్నారు..
  • పార్సిళ్లలో మందులు ఉన్నట్లు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి పోస్టల్ అధికారులను మోసగిస్తున్నారు..
  • ఇస్రీ బజార్, ఫుస్రో పోస్టాఫీసుల నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా పార్సిళ్లు బుక్ చేసినట్లు గుర్తించాం..
  • వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుని UPI ద్వారా నగదు లావాదేవీలు..
  • రోజుకు 80–100 ఆర్డర్లు వస్తున్నాయి. అందులో 8–10 స్పీడ్ పోస్ట్ పార్సిళ్ల ద్వారా గంజాయి పంపిణీ చేస్తున్నారు.. 
  • ఒక్కో పార్సిల్‌లో 50–250 గ్రాముల గంజాయి ఉంచుతూ డెలివరీ చేస్తున్నారు..
  • ఒక్కో ప్యాకెట్ రూ.1,500 నుంచి రూ.8,000 వరకు అమ్ముతున్నారు..
  • రోజుకు సుమారు రూ.1 లక్ష ఆదాయం.. నెలకు 30 నుంచి 35 లక్షలు, ఏడాదికి రూ.4–5 కోట్ల టర్నోవర్ ఉంది..
  • సరఫరాదారులు, కస్టమర్స్ మధ్య కోడ్స్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ జరుగుతుంది..
  • వాట్సప్ లో వివిధ కోడ్స్ ద్వారా కస్టమర్స్ గంజాయి ఆర్డర్ చేస్తున్నారు..
  • వచ్చిన డబ్బుతో నిందితులు  బంగారం, లగ్జరీ వాహనాలు కొనుగోలు చేశారు..
  • నిందితులు పలు బ్యాంక్ ఖాతాలు, PhonePe UPI ఐడీలతో మనీలాండరింగ్ చేసినట్లు గుర్తించాం..
  • రైళ్లు, విమానాల ద్వారా వచ్చిన స్పీడ్ పోస్ట్ పార్సిళ్లకు స్కానింగ్ లేకపోవడంతో సరఫరా సులభం అయింది..
  • పోస్టల్ పార్సిళ్లకు తప్పనిసరి స్కానింగ్ అమలు చేయాలని కేంద్ర శాఖలకు లేఖ రాస్తాము..
  • ఎస్ ఆర్ నగర్, గుడిమల్కపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్సిల్స్ పై అనుమానం కలిగి దర్యాప్తు చేశాం..
  • హైదరాబాద్ కు వచ్చిన 2 పార్కిల్స్ ఫ్లైట్ లోనే వచ్చాయి..
  • నగరంలోని అన్ని కొరియర్ సంస్థలకు ప్రతి పార్సిల్‌ను తప్పనిసరిగా స్కాన్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తాం..
  • అనుమానాస్పద పార్సిళ్లు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం..
     
©️ VIL Media Pvt Ltd.