
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ (Lenin) . భారీ అంచనాల మధ్య ఈ మూవీ జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకన్నారు. ‘ఏజెంట్’ మూవీ తర్వాత అఖిల్ ఏకంగా మూడేళ్ల పాటు లాంగ్ బ్రేక్ తీసుకోవడం వెనుక ఉన్న పెయిన్‌ఫుల్ సీక్రెట్‌ను మొదటిసారి బయటపెట్టారు.
48 కుట్లు.. 16 నెలల నరకం..
‘ఏజెంట్’ మూవీ విడుదలైన మూడు నెలలకే బాత్రూంలో ప్రమాదవశాత్తు పడిపోయాను అని అఖిల్ తెలిపారు. గాజు ముక్కలు ఎడమ చేతికి బలంగా గుచ్చుకోవడంతో రెండు సర్జరీలు జరిగాయి, ఏకంగా 48 కుట్లు పడ్డాయి. 8 నెలల పాటు కనీసం బరువులు కూడా ఎత్తలేకపోయాను. పూర్తిగా కోలుకోవడానికి 16 నెలలు పట్టింది అంటూ అఖిల్ ఎమోషనల్ అయ్యారు. తన గ్యాప్ వల్ల కోపంగా ఉన్న ఫ్యాన్స్‌కు.. ఇకపై ఇలాంటి విరామం రాదని గట్టి హామీ ఇచ్చారు.
‘లెనిన్’ అంటే కమ్యూనిజం కాదు..
ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఇది పొలిటికల్ లేదా కమ్యూనిజం బ్యాక్‌డ్రాప్ సినిమా అనే రూమర్స్ వచ్చాయి. దీనిపై అఖిల్ ఫుల్ క్లారిటీ ఇస్తూ.. దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరు స్వగ్రామమైన రాయలసీమకు వెళ్లినప్పుడు అక్కడ లెనిన్ బాబు అనే వ్యక్తిని కలిశాం. సీమ ప్రాంతంలో పిల్లలకు లెనిన్, స్టాలిన్ అని పేర్లు పెట్టడం చాలా కామన్. ఈ టైటిల్‌కు ఎలాంటి రాజకీయ కనెక్టివిటీ లేదు అని తేల్చేశారు. ఇదొక పవర్‌ఫుల్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న కుర్రాడి కథ. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఇంటెన్స్ యాక్షన్ లవ్ డ్రామా ఇది అని అఖిల్ చెప్పారు.
ALSO READ : VARANASI: బ్లాక్ ఫారెస్ట్‌లో భారీ యాక్షన్‌కు రంగం సిద్ధం..
భారతిగా భాగ్యశ్రీ బోర్సే..
టాలీవుడ్ క్రేజ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో ‘భారతి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. లెనిన్ ( అఖిల్ ) ఏం చేసినా భారతి కోసమే చేస్తాడని, నటిగా తన ప్రతిభను నిరూపించుకునే క్రేజీ రోల్ ఇదని ఆమె పేర్కొంది. మురళీకిశోర్ అబ్బూరు డైరెక్షన్‌లో సరికొత్త మేకోవర్‌తో వస్తున్న అఖిల్.. జూలై 10న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.