
హైదరాబాద్ సిటీలో కలకలం. లంగర్ హౌస్ పరిధిలోని ఓ లాడ్జిలో యువతి డెడ్ బాడీ సంచలనంగా మారింది. 26 ఏళ్ల రేణుక అ నే యువతి.. హైదరాబాద్ సిటీలోని ఓ బార్ అండ్ హోటల్ లో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఫరూక్ అనే 34 ఏళ్ల వ్యక్తి పరిచయం అయ్యాడు.
ఈ పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. 2026, జూలై 2వ తేదీ రేణుక, ఫరూక్ ఇద్దరూ కలిసి లంగర్ హౌస్ వచ్చారు. అక్కడ ఓ హోటల్ లో రూం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి గదిలో దిగారు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. రాత్రి సమయంలో రేణుక ఉరి వేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రేణుక ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు ఫరూక్.
రేణుక మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. రేణుకది ఆత్మహత్య కాదని.. హత్య అంటున్నారు యువతి రేణుక పేరంట్స్. రేణుకతోపాటు గదిలో దిగిన ఫరూక్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
రేణుక ఆత్మహత్య చేసుకున్నది అనుకున్నట్లయితే ఆ సమయంలో ఫరూక్ ఎక్కడ ఉన్నాడు.. ఇద్దరూ కలిసే కదా గది తీసుకున్నది అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి గదిలో ఏం జరిగింది.. రేణుక మరణనానికి కారణం ఎవరు.. రేణు, ఫరూక్ మధ్య ఏం జరిగింది అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకాల్సి ఉంది.