Reading Time: < 1 minute

ఫలక్ నుమాలో తగలబడుతున్న దుకాణాలు : దగ్గరలోనే గ్యాస్ స్టేషన్ ఉండటంతో హై టెన్షన్

Caption of Image.

 హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే చందానగర్ లోని   ఐదంతస్థుల బిల్డింగ్ మంటల్లో తగలబడిపోగా..ఇవాళ మార్చి 16న  ఫలక్ నుమా ఓ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో  మంటలను  అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న మరో ఆరు  దుకాణాలకు కూడా మంటలు విస్తరించాయి.  

ఫర్నీచర్ దుకాణం వెనుక భాగంలో నే శారదా గ్యాస్ ఏజన్సీ, ఎదురుగా గ్యాస్  రిఫిలింగ్ పంప్  కూడా  ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్యాస్ ఏజెన్సీ లోకి మంటలు రానివ్వకుండా  ఫలక్ నుమా పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది జాగ్రత్తగా  ప్రయత్నిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు. 

వరుస ఘటనలు

మార్చి 14న వేకువజామున  టోలిచౌకిలోని కుతుబ్​షాహి టూంబ్స్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం..  మార్చి 12న  అర్ధరాత్రి చందానగర్​లోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న అను ఫర్నిచర్ దుకాణంలో మరో  అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. 

ALSO READ : తెలంగాణ నీటి హక్కుల్ని ఏపీ కాలరాస్తుంది: హరీశ్ రావు

 

 

©️ VIL Media Pvt Ltd.