July 12, 2026

Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో ‘వీరాధి వీరులు’

Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో ‘వీరాధి వీరులు’
Reading Time: < 1 minute
Ravi Teja Sree Vishnu Movie To Clash With Anil Ravipudi Venkatesh Kalyan Ram Film

టాలీవుడ్‌లో సంక్రాంతి పండగ సీజన్ అంటే బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అగ్ర నిర్మాతలు, స్టార్ డైరెక్టర్ల మధ్య థియేటర్ల వేటలో అప్పుడప్పుడు చిన్నపాటి క్లాష్ లు సహజం. ఇప్పుడు అలాంటి పోటీ మరోటి ఉండబోతుంది. ఇప్పటికే ఈ రేస్ లో అనిల్ రవిపూడి – వెంకీ – కళ్యాణ్ రామ్ సినిమా ఉంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కాంబినేషన్‌లో హసిత్ గోలి దర్శకత్వంలో తాము నిర్మించబోయే క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని 2027 సంక్రాంతి రేసులో నిలుపుతున్నారట. ఈ విషయాన్నీ ఆప్తమిత్రుడు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి వారు ముందే తెలియజేసినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది.

దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో అనిల్ రావిపూడి వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ ఆ సంస్థకు అత్యంత సన్నిహితుడిగా మారారు. వచ్చే సంక్రాంతి రేసులో అనిల్ రావిపూడి సినిమా కూడా ఉండటంతో, బాక్సాఫీస్ క్లాష్ వల్ల తమ మధ్య ఉన్న సత్సంబంధాలు ఎక్కడ దెబ్బతింటాయోనని నిర్మాతలు శిరీష్, రాజు  తమ సినిమా పండగ రిలీజ్ ప్లానింగ్‌ను అనిల్ రావిపూడికి ముందుగానే చెప్పి చర్చించారట. దీనివల్ల ఇండస్ట్రీలో ఎలాంటి అపార్థాలకు తావులేకుండా అలా చేశారట. రవితేజ మాస్ ఎనర్జీ, శ్రీవిష్ణు మార్క్ కామెడీ టైమింగ్ కలగలిపి దర్శకుడు హసిత్ గోలి ఒక హిలేరియస్ వినోదాత్మక కథను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి ‘వీరాధి వీరులంట’ అనే క్రేజీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను 2027 సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. పండగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా దిల్ రాజు టీమ్ శరవేగంగా అడుగులు వేస్తోంది.