Reading Time: < 1 minute

కొండగట్టు అంజన్న ఆలయంలో సింహ ద్వారం ప్రారంభం

Caption of Image.

కొండగట్టు, వెలుగు: అంజన్న కొండగట్టు అంజన్న ఆలయానికి సరికొత్త శోభ సంతరించుకుంది. సుమారు 40 ఏండ్ల కింద ఆలయానికి ఏర్పాటు చేసిన సింహద్వారం శిథిలావస్థకు చేరుకోవడంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆలయ సంప్రదాయాల ప్రకారం శనివారం సింహద్వారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న రాజగోపురం సింహద్వారాన్ని ప్రారంభించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో కొండగట్టు అంజన్న ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధి చేసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవో అంజనారెడ్డి, ఏఈవో హరిహరపాధ్, సూపరిటెండెంట్‌‌‌‌ చంద్రశేఖర్, సునీల్, లీడర్లు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.