మంచిర్యాలలో సూపర్‌ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి : బీజేపీ లీడర్లు

కోల్‌బెల్ట్/ ఆదిలాబాద్ టౌన్, వెలుగు: మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో పలు సూపర్ఫాస్ట్ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్కల్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్‌ను బీజేపీ లీడర్లు కోరారు. శనివారం హైదరాబాద్‌వచ్చిన రైల్వే మంత్రిని బీజేపీ స్టేట్వైస్ ప్రెసిడెంట్రఘునాథ్వెరబెలి నేతృత్వంలో లీడర్లు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాలలో ఏపీ ఎక్స్‌ప్రెస్, కేరళ ఎక్స్‌ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్.. వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లను ఆపాలని కోరారు.
ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పలు కీలక రైల్వే ప్రాజెక్టులు, ప్రజాసమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే మంత్రిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఆదిలాబాద్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు కేంద్ర నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.