July 12, 2026

Cheteshwar Pujara: వామ్మో.. ఈసారి ఆ జోడి చాలా ప్రమాదకరం

Cheteshwar Pujara: వామ్మో.. ఈసారి ఆ జోడి చాలా ప్రమాదకరం
Reading Time: < 1 minute

Cheteshwar Pujara: వామ్మో.. ఈసారి ఆ జోడి చాలా ప్రమాదకరం

Caption of Image.

Cheteshwar Pujara: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సందడి మరో 12 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీన ఆర్సీబీ వర్సెస్ -ఎస్ఆర్‌హెచ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ స్టార్ట్ కానుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి భారత మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత విధ్వంసకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు ఎస్ఆర్‌హెచ్ అని పేర్కొన్నాడు. ట్రావిస్ హెడ్– -అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరం అని చెప్పుకొచ్చాడు. 

గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ చాలా బాగుందని ఛతేశ్వర్ పుజారా పేర్కొన్నారు. ఇన్సింగ్స్ ఫస్ట్ బంతి నుంచే అటాక్ చేసే సామర్థ్యం వారి ఇద్దరికీ ఉంది. దీంతో వారి వల్లే టీమ్ తరచూ 250+ స్కోర్లను నమోదు చేస్తుంది. అత్యంత దూకుడైన ఓపెనింగ్ జోడీ ఎవరు అనే క్వశ్చన్ ఎదురైతే.. చాలా మంది విరాట్ కోహ్లీ-– క్రిస్ గేల్ అని అంటుంటారు.. కానీ ప్రస్తుతం మాత్రం హెడ్-– అభిషేక్ శర్మ జోడీనే వారికంటే విధ్వంసకరంగా మారిపోయిందని  అన్నారు. బౌలర్లు ఎవరూ కూడా అభిషేక్– -హెడ్ లాంటి ఓపెనర్లకు బౌలింగ్ చేయాలని అనుకోరని పుజారా వెల్లడించారు. 

►ALSO READ | Kamran Akmal: పాకిస్థాన్‌ ఎలాగు గెలిచేలా లేదు.. ఐసీసీ ట్రోఫీని దొంగిలించాలని ప్లాన్ చేస్తుందేమో?

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఒక ప్రధాన సమస్య ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా తెలిపాడు. హైదరాబాద్‌లో ఆడే మ్యాచ్‌ల్లో టీమ్ భారీ స్కోర్లు సాధిస్తుంది, కానీ బయట స్టేడియాల్లో మాత్రం అదే దూకుడు కొనసాగించలేకపోతుందని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ జట్టు కేవలం బ్యాటింగ్‌ మీదనే ఆధారపడింది. ముఖ్యంగా హెన్రీచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తొందరగా ఔట్ అయినా తర్వాత జట్టు పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతోందని పేర్కొన్నాడు. ఈ లోపాన్ని ప్రత్యర్థి జట్లు  బాగా ఉపయోగించుకుంటున్నాయని అన్నారు. బౌలింగ్ విషయంలోనూ ఎస్ఆర్‌హెచ్ కాస్త మెరుగు పడాల్సి ఉందని పుజారా సూచించారు.  
 

©️ VIL Media Pvt Ltd.