
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో కాల్పుల కలకలం సృషించాయి. కార్డెన్ సెర్చ్ లో పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. బస్టాండ్ వద్ద బాలాజీ హోటల్‌లో తనిఖీలు చేస్తుండగా పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. కాల్పులకు యత్నించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఒక 9ఎంఎం పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు యత్నించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన వాడిగా గుర్తించారు. హోటల్ గదిలో తుపాకీతో ఎందుకు ఉన్నాడు? పోలీసులపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.