Reading Time: < 1 minute

 దేశంలో జాతీయ రాజకీయ పార్టీల ఆదాయ వివరాల క్రమంలో 2024 25 ఆర్థిక సంవత్సరంలో అధికారిక బిజెపి అగ్రస్థానంలో నిలిచింది. బిజెపికి ఈ ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం మొత్తం రూ 6769.14 కోట్లుగా తేలింది. మొత్తం ఆరు జాతీయ పార్టీల ఆదాయ వ్యయ వివరాలను అసోసియేషన ఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) తన సమాచారం క్రమంలో వెలుగోకి తీసుకువచ్చింది. పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికల దశలో వివరాలు వెల్లడి అయ్యాయి. పార్టీలకు దక్కిన మొత్తం ఆదాయాన్ని రూ 7960.9 కోట్లుగా తేల్చారు. ఇందులో బిజెపికి దక్కింది 85 శాతం వరకూ ఉందని నిర్థారణ అయింది. ఇక రెండోస్థానంలో కాంగ్రెస్ పార్టీకి రూ 918 కోట్లు,

మూడో స్థానంలో సిపిఎంకు 172 కోట్లు, బిఎస్‌పికి రూ 58 కోట్లు దక్కాయి. తరువాతి స్థానంలో ఆప్, ఎన్‌పిఇపిలు నిలచాయి. కాగా బిజెపి తన ఆదాయంలో దాదాపు 56 శాతం ఖర్చు పెట్టింది. అంటే రూ 3774 కోట్లకు పైగా వెచ్చించింది. కాంగ్రెస్‌కు దాదాపు రూ 1100 కోట్ల వరకూ ఖర్చు పెట్టింది. అంటే వచ్చిన ఆదాయం కన్నా 21 శాతం అధికంగా ఖర్చు లెక్కలు చూపింది. బిఎస్‌పి కూడా తమకు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు అయినట్లు ఆడిట్ లో తేల్చారు. ఇక రాజకీయ పార్టీలకు వచ్చిన ఆదాయం ఎక్కువగా విరాళాల రూపంలోనే అందిందని వెల్లడైంది. ఎడిఆర్ లెక్కలలో ఈసారి ప్రాంతీయ పార్టీలకు దక్కిన ఆదాయం వివరాలు వెలుగులోకి రాలేదు.