Reading Time: < 1 minute

IPL 2026: RCB ఫ్యాన్స్‎కు పండగ లాంటి వార్త.. బెంగళూర్‎లోనే హోం మ్యాచెస్.. కాకపోతే..

Caption of Image.

బెంగళూర్: రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) అభిమానులకు గుడ్ న్యూస్. 2026 ఐపీఎల్‎లో భాగంగా బెంగళూర్‎లోని చినస్వామి స్టేడియంలోనే ఆర్సీబీ తమ హోమ్ మ్యాచులను ఆడనుంది. కాకపోతే 5 మ్యాచులను మాత్రమే ఆర్సీబీ బెంగళూర్‏లో ఆడనుంది. మిగిలిన రెండు హోం గ్రౌండ్ మ్యాచులను రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడనుంది. ఈ మేరకు ఆర్సీబీ యాజమాన్యం మంగళవారం (మార్చి 3) అధికారికంగా ప్రకటించింది. 

‘‘ఐపీఎల్ 2026లో ఆర్సీబీ బెంగళూరులో ఐదు హోం మ్యాచ్‌లు ఆడనుంది. మిగిలిన రెండు హోం మ్యాచులు రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతాయి. బెంగళూర్‎లో ఆర్సీబీ మ్యాచుల నిర్వహణకు మద్దతు ఇచ్చిన కర్నాటక ప్రభుత్వం, కర్నాటక క్రికెట్ అసోసియేషన్, పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్నస్వామి స్టేడియం మా సొంత మైదానం కంటే ఎక్కువ. ఇక్కడే ఒక జట్టుగా మా నిజమైన గుర్తింపు దక్కింది’’ అని ఆర్సీబీ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఐపీఎల్ 2026 ఓపెనింగ్ సెర్మనీ, ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది.

►ALSO READ | T20 World Cup: టీమిండియాపై చంద్రగ్రహణం ఎఫెక్ట్: ముంబైలో మారిన ప్రాక్టీస్ సెషన్ టైమింగ్

2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవడంతో ఆర్సీబీ యాజమాన్యం 2025, జూన్ 4న బెంగుళూర్‎లో విక్టరీ పరేడ్, చినస్వామి స్టేడియంలో ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ విజయోత్సవ ర్యాలీకి అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. 

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ చినస్వామి స్టేడియంలో అంతర్జాతీయ, దేశీయ మ్యాచుల నిర్వహణపై నిషేధం విధించింది. దీంతో 2026 ఐపీఎల్ సీజన్‎లో బెంగళూర్‎లో ఆర్సీబీ హోం మ్యాచెస్ ఆడటంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ప్రేక్షుకుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కర్నాటక ప్రభుత్వం, కర్నాటక క్రికెట్ అసోసియేషన్, ఆర్సీబీ ఫ్రాంచైజీ బెంగళూర్ లో ఆర్సీబీ హోం మ్యాచెస్ నిర్వహణకు కృషి చేశాయి. 

©️ VIL Media Pvt Ltd.