
వంటింట్లో ఉన్న ఔషధాల్లో అల్లం ఒకటి. ఎన్నో ఆరోగ్య సమస్యలకి ఇలాంటి వంటింటి చిట్కాలు చెక్ పెడతాయి. అల్లంతో ఆరోగ్యానికి ఎన్నో బాభాలున్నాయి. వంటల్లో వాడటమే కాకుండా, ఇలాంటి చిట్కాలు పాటిస్తే మంచిది. అల్లాన్ని విడిగా తినలేం. వర్షాకాలం ఈ ఫుడ్ మంచి ఆరోగ్యం . అందుకే అల్లం చట్నీ.. అల్లం పులుసు ఎంతో రుచిగా ఉంటాయి.. వీటిని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
ఇమ్యూనిటీ పెరుగుతుంది. అల్లంలో అనేక యాంటీమైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పెరగడానికి సాయపడతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు ఉన్నప్పుడు అల్లాన్ని ఏదో ఒకవిధంగా తీసుకోవాలి. ఎందుకంటే దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి సమస్యలు దూరమవుతాయి.
అల్లం చట్నీ తయారీకి కావాల్సినవి
- అల్లం తరుగు – రెండు కప్పులు
- నూనె – సరిపడా
- వెల్లుల్లి రెబ్బలు -పన్నెండు
- జీలకర్ర – ఒక టీ స్పూన్
- ధనియాలు -ఒక టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు – అర కప్పు
- కరివేపాకు -రెండు రెమ్మలు
- పసుపు – అరటీ స్పూన్
- పుట్నాలు- ముప్పావు కప్పు
- ఉప్పు తగినంత
- బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు
అల్లం చట్నీ తయారీ విధానం
అల్లం పొట్టు తీసి సన్నగా తరగాలి.తర్వాత ప్లైన్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో అల్లం తరుగు వేసి కొద్ది సేపు వేగించాలి. ఆ పైన జీలకర్ర, ధనియాలు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తరుగు పసుపు వేసి మరికాసేపు వేగించాలి.
ఇవన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో పుట్నాలు, చింతపండు.. గుజ్జు, బెల్లం ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి.
తర్వాత జీలకర్ర, కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి వచ్చిమిర్చి నచ్చని వాళ్లు ఎండుమిర్చి వాడొచ్చు. ఇది దోసె పెసరట్టుకు మంచి కాంబినేషన్
అల్లం పులుసు తయారీకి కావాల్సినవి
- అల్లం తరుగు – పావు కప్పు
- చింతపండు గుజ్జు -కొద్దిగా
- ఉల్లిగడ్డ తరుగు – పావు కప్పు
- జీలకర్ర – అర టీ స్పూన్
- ఆవాలు -పావు టీ స్పూన్
- ఎండుమిర్చి-నాలుగు
- వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
- పసుపు – పావు టీస్పూన్
- కొత్తిమీర తరుగు – అర కప్పు
- కరివేపాకు-రెండు రెమ్మలు
- పచ్చిమిర్చి – మూడు
అల్లం పులుసు తయారీ విధానం
అల్లం పొట్టు తీసి సన్నగా తరగాలి. మరోవైపు చింతపండులో నీళ్లు పోసి గుజ్జు తీసి పక్కనబెట్టాలి. మిక్సీ జార్లో అల్లం తరుగు వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పసుపు వేసి గ్రైండ్ చేయాలి.
పాన్ లో నూనె వేడి చేసి, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. తర్వాత అల్లం ముద్ద వేసి కలపాలి.
ఆపైన చింతపండు గుజ్జు, సరిపడా నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి కావాలంటే కారం వేసుకోవచ్చు. చివరగా కొత్తిమీర చల్లాలి.
ఇంకా ఎన్నో లాభాలు ఇలా..!
అల్లం చాయ్ పొట్ట ఉబ్బరం, కడుపు నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. అల్లంలో ఉండే ఔషధ గుణాలు పొట్టలో ఉన్న గ్యాస్ ను బయటికి పంపడానికి ఉపయోగపడతాయి. దాంతో ఉబ్బరం, నొప్పి తగ్గుతాయి.
వర్షా కాలంలో సాధారణంగా వచ్చే జలుబు బారిన పడకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు అల్లం బాగా ఉపయోగపడుతుంది.
చిన్న ముక్కలుగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ అల్లాన్ని రెండు కప్పుల నీళ్లలో వేసి పది నిమిషాలు మరిగించాలి.
అల్లంతో కాచిన ఈ నీళ్లు వేడి తగ్గిన తర్వాత కొన్ని తేనె చుక్కలు కలిపి తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగితే జలుబు త్వరగా తగ్గుతుంది.