Reading Time: < 1 minute
Nivin Pauly Rukmini Vasanth New Malayalam Movie

Rukmini Vasanth: మలయాళ సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ హీరో నివిన్ పౌలీ, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ తొలిసారి జంటగా నటిస్తున్న కొత్త రొమాంటిక్ కామెడీ సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి నషీద్ ఫమీ దర్శకత్వం వహిస్తుండగా.. మార్టిన్ ప్రక్కట్ ఫిల్మ్స్, పౌలీ జూనియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ రోజు నిర్వహించిన పూజా కార్యక్రమంలో చిత్ర బృందం, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నివిన్ పౌలీ, రుక్మిణి వసంత్‌కి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమాతో రుక్మిణి వసంత్ మలయాళ చిత్రసీమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే తన నటనతో భాషలకు అతీతంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నివిన్ పౌలీతో కలిసి తొలిసారి మలయాళ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు నటుడు అజు వర్గీస్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. లవ్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఫ్రెష్ కాంబినేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నివిన్ పౌలీ – రుక్మిణి జోడీని చూసిన అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ జోడిపై ‘క్యూట్’, ‘డ్రీమీ కాంబినేషన్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఇతర నటీనటులు, విడుదల తేదీకి సంబంధించిన వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.