
విశాఖపట్నం సినీ ప్రేక్షకులకు మరో కొత్త సినిమా అనుభూతి అందుబాటులోకి వచ్చింది. ఇనార్బిట్ మాల్‌లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘AAA సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఘనంగా ప్రారంభించారు. ఆగస్టు 9న జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో సందడి నెలకొంది.
అల్లు అర్జున్ మాట్లాడుతుండగా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఐకాన్ ఫ్యాన్ ఒకరు.. ఫోటో కావాలని అడగగా.. ‘‘నా ఫ్యాన్స్ సెల్ఫీ అడిగితే.. నో అంటానా? కాదనడానికి మనసు రాదు..’’ అంటూ ఎంతో ఆప్యాయంగా ఫోటో దిగారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. అభిమానులతో అల్లు అర్జున్ చూపించే ఆప్యాయత, ఆయన సింప్లిసిటీ పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెరపైనే కాదు, తెరవెనుక కూడా ఆయన నిజమైన ‘ఐకాన్’ అంటూ కొనియాడుతున్నారు.
FANS : Photo కావాలి అన్న..
#Alluarjun: పైకి వచ్చేయండి ఫ్యాన్స్ అడిగారు అంటే నో అనడం నాకు రాదు. pic.twitter.com/ZJfCg9sIZ6
— Milagro Movies (@MilagroMovies) August 9, 2026
AAA సినిమాస్ ప్రత్యేకతలు
ఏషియన్ సినిమాస్‌తో కలిసి అల్లు అర్జున్ భాగస్వామ్యంతో కొనసాగుతున్న AAA సినిమాస్ బ్రాండ్‌కు హైదరాబాద్‌లో ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ బ్రాండ్‌ను విశాఖపట్నానికి విస్తరించారు. ఆంధ్రప్రదేశ్‌లో AAA సినిమాస్ కు ఇది తొలి మల్టీప్లెక్స్ కావడం విశేషం.
►ALSO READ | Movie Review: ఓటీటీలోకి ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్.. చివరి వరకు కట్టిపడేసే ట్విస్టులే
ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం 8 స్క్రీన్లు, 1,556 సీట్ల సామర్థ్యం ఉన్నట్లు సమాచారం. అత్యాధునిక సాంకేతికతతో ప్రేక్షకులకు ప్రీమియం సినిమా అనుభూతిని అందించేలా దీనిని రూపొందించారు. ఇందులో 70 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుతో కూడిన భారీ LED సినిమా స్క్రీన్, అధునాతన ప్రొజెక్షన్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
ప్రేక్షకుల సౌకర్యం కోసం ICON STAR Lounge, VIP ఎంట్రీ, రిక్లైనర్ సీటింగ్ వంటి ప్రీమియం సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ‘82 Lounge’లో ప్రైవేట్ స్క్రీనింగ్స్‌తో పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించుకునే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో ఇప్పటికే AAA Cinemasకు మంచి గుర్తింపు ఉండగా.. విశాఖలో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభంతో ఉత్తరాంధ్రలో ప్రీమియం సినిమా ఎక్స్‌పీరియన్స్‌కు మరింత ఊతం లభిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణ ప్రేక్షకుల కోసం రెగ్యులర్ స్క్రీనింగ్స్ ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
మరోవైపు, అల్లు అర్జున్ స్వయంగా ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమంపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూనే.. సినిమా ఎగ్జిబిషన్ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్న అల్లు అర్జున్‌కు AAA Cinemas మరో కీలకమైన అడుగుగా నిలుస్తోంది.
‘రాకా’లో బన్నీ త్రిపాత్రాభినయం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘రాకా’. ‘ పుష్ప ‘ సినిమాతో నేషనల్ వైడ్‌గా రూల్ చేసిన బన్నీ.. ఈసారి అట్లీతో కలిసి ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు రెడీ అవుతున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ నెవర్ బిఫోర్ విజువల్ వండర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో అల్లు అర్జున్ కెరీర్‌లోనే మొదటిసారి త్రిపాత్రాభినయంచేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ మూడు విభిన్న కాలాలకు సంబంధించిన షేడ్స్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించనున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్‌తో బన్నీ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
#RAAKA pic.twitter.com/BY1dzQFLY8
— Allu Arjun (@alluarjun) April 8, 2026