Reading Time: 2 minutes

హైదరాబాద్ స్టార్టప్ ఘనత..ప్రయోగానికి సిద్దమవుతున్న స్కైరూట్ విక్రమ్-1 రాకెట్ 

Caption of Image.

భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన తొలి ఆర్బిట్ లాంచ్ వెహికల్ (Orbital Launch Vehicle) విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ లో విక్రమ్-1 రాకెట్ మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.

విక్రమ్-1 రాకెట్ చిన్న ఉపగ్రహాలను (Small Satellites) భూమికి సమీప కక్ష్య (Low Earth Orbit – LEO)లోకి తీసుకెళ్లేందుకు రూపొందించారు. ప్రస్తుతం రాకెట్‌లో వివిధ దశల ఇంటిగ్రేషన్ (Integration), సిస్టమ్ టెస్టింగ్ (System Testing), తుది సాంకేతిక పరీక్షలు కొనసాగుతున్నాయి. రాకెట్ భాగాలను జాగ్రత్తగా అమర్చి పూర్తి ప్రయోగ వాహనంగా సిద్ధం చేస్తున్నట్లు స్కైరూట్ సంస్థ తెలిపింది.

►ALSO READ | గూగుల్ రూ.9 కోట్ల శాలరీ ఉన్నా జాబ్ రిజైన్.. సొంతంగా ఏఐ స్టార్టప్ కంపెనీ షురూ

ఇదే ప్రయోగ వేదిక నుంచి గతంలో చంద్రయాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) వంటి చారిత్రాత్మక ప్రయోగాలను ఇస్రో (ISRO) విజయవంతంగా నిర్వహించింది. అయితే, ఈ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన కక్ష్య శ్రేణి రాకెట్ ప్రయోగం జరగడం ఇదే తొలిసారి.

విక్రమ్-1 ప్రయోగ తేదీని ఇంకా ప్రకటించలేదు. ఎందుకంటే ఇది తొలి పరీక్షా ప్రయోగం కావడంతో అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తవడంతో పాటు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుంచి అవసరమైన అనుమతులు, రేంజ్ లభ్యత ఆధారంగా తుది షెడ్యూల్ ఖరారు కానుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత ప్రైవేట్ స్పేస్ పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.