
తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (యాదాద్రి) కోసం నూతన ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ బోర్డుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంఎస్ఎన్ గ్రూప్ (MSN Group) వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో 18 మంది సభ్యులతో కూడిన బోర్డు నియామకం ఖరారైంది. నటుడు చిరంజీవి భార్య కొణిదెల సురేఖ, ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి సహా పలువురు సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులయ్యారు. తెలంగాణ ధార్మిక, హిందూ మత సంస్థలు ,ఎండోమెంట్స్ చట్టం-2025 ప్రకారం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
►ALSO READ | కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువా