Reading Time: < 1 minute

హీరో అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి..గచ్చిబౌలి పీఎస్ కేసు నమోదు 

Caption of Image.

హీరో అఖిల్ రాజ్ కు డెలివరీ బాయ్ తో జరిగిన గొడవ వివాదాస్పదంగా మారింది. మంగళవారం (జూన్ 30) సాయంత్రం కొందరు దుండగులు అఖిల్ రాజ్ ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. దీంతో తనపై దాడి జరిగిందని అఖిల్ రాజ్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు. కొండాపూర్ లో కొంతమంది తన కారును అడ్డగించి దాడికి యత్నించారని ఫిర్యాదు చేశారు. అఖిల్ రాజ్ కారుపై దాడి చేసినట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

►ALSO READ | పిల్లలను చంపేస్తామంటూ చిన్మయి ఫ్యామిలీకి బెదిరింపులు.. సోషల్ మీడియాకు రాహుల్ రవీంద్రన్ గుడ్ బై!

నిన్న  రాజు వెడ్స్  రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్  ఓ డెలివరీ బాయ్ పై దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హీరో అఖిల్ రాజ్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయగా, డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన హీరో, సదరు డెలివరీ బాయ్‌పై ఇలా దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇరువర్గాల వాదనలను విచారిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.