
డైరెక్టర్ నందిని రెడ్డి, హీరోయిన్ సమంత కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. జబర్దస్త్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోగా.. ఓ బేబీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబినేషన్ లో ముచ్చటగా వచ్చిన మూడో సినిమా మా ఇంటి బంగారం. జూన్ 19న రిలీజైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు సామ్ సినిమాకు రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. తద్వారా తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మా ఇంటి బంగారం టాప్ 3 ప్లేసులో నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో రుద్రమ దేవి (87 కోట్లు), మహానటి (84) ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా జోరును చూస్తుంటే త్వరలోనే మా ఇంటి బంగారం సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇంతకు ముందు కూడా సామ్ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది. కానీ ఇందులో ఆమె కేవలం కామెడీ, ఎమోషన్లతో మాత్రమే కాకుండా.. యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది. సినిమాలో ఆ సీక్వెన్సులు హైలైట్‌గా నిలిచాయి. ఈ క్రమంలో మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన నందిని రెడ్డి సామ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘సమంత పెద్ద స్టార్ అని నమ్మే నేను ఆమెతో యాక్షన్ సీన్స్ చేయించాను. హాలీవుడ్ లో యాక్షన్ ఘట్టాలకు టామ్ క్రూయిజ్ పెట్టింది పేరు కాబట్టి.. ఆయన లాగే సమంత కూడా కూడా ఆయన లాగా యాక్షన్ సీక్వెన్సులను అద్భుతంగా పండించగలదని నేను గట్టిగా నమ్మాను. ఆ ఉద్దేశంతోనే నేను నా ఫోన్ లో సమంత పేరును ‘సామ్ క్రూయిజ్’ అని సేవ్ చేసుకున్నాను’ అని నందిని రెడ్డి వెల్లడించింది. ప్రస్తుతం ఈ లేడీ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
వైజాగ్ లో సమంత మా ఇంటి బంగారం సక్సెస్ మీట్.. వీడియో
The #Thassadiya vibe at the #MaaIntiBangaaram Success Meet in Vizag
Watch the BLOCKBUSTER 𝐒𝐀𝐌BHAVAM #MaaIntiBangaaram in theatres today
Book your tickets now!
https://t.co/P89ifZn9Ss@TralalaPictures @Samanthaprabhu2 #RajNidimoru #NandiniReddy @himankd… pic.twitter.com/xJZISt8Uvk
— Tralala Moving Pictures (@TralalaPictures) June 30, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

