Reading Time: < 1 minute

ములుగులో అర్థరాత్రి రెండు వైన్స్ షాపుల్లో చోరీ.. కటింగ్ మిషన్ తో డోర్స్ కట్ చేసి దొంగతనం

Caption of Image.

ములుగు జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. రెండు వైన్ షాపుల్లో చోరీ చేశారు. కటింగ్  మిషన్లతో డోర్స్ కట్ చేసి నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే.. 

ములుగు పట్టణ కేంద్రంలోని ఆదివారం (మే24) అర్థరాత్రి 163 నేషనల్ హైవే పై ఉన్న రెడ్డి వైన్స్, పెద్దమ్మ వైన్స్ షాపుల్లో ఈ చోరీ జరిగింది. అధునాతన కట్టర్తో డోర్ ను కట్ చేసి లోపలికి ప్రవేశించారు. రెండు షాపుల్లో రూ. 60 వేల నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ములుగు ఎస్ ఐ ఉపేందర్ రావు. సీసీఫుటేజీ ఆధారంగా దొంగలకోసం గాలిస్తున్నారు. 

ALSO READ : రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్

©️ VIL Media Pvt Ltd.