
కాసుల వేటలో పక్కదారి పట్టారు..షార్ట్‌కట్‌లో లక్షలు సంపాదించే మార్గాలు వెతికారు…బట్ చివరకు ఆశ తీరకుండానే కటకటాల పాలయ్యారు.. ఇంతకీ ఎవరు వాళ్లు..ఏం చేశారు. రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పాత నాణేలు, ఇత్తడి చెంబు, మ్యాజిక్ కాయిన్స్ అంటూ మోసాలకు దిగుతున్న ఘరానా ముఠాను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో నలుగురు అరెస్ట్ కాగా…ఇద్దరు పరారీలో ఉన్నారు. కుంబార్లపల్లికి చెందిన క్రిష్ణప్ప, కమ్మేపల్లికి చెందిన షేక్ ఇలియాజ్, కర్ణాటక కోలార్‌కు చెందిన మునీష్, చౌడేపల్లికి చెందిన విజయ్‌కుమార్, రాజులూరుకి చెందిన శంకర్, పెద్దపంజాణికి చెందిన నాగరాజు ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. తమిళనాడు కృష్ణగిరికి చెందిన శేఖర్‌తో రైస్ పుల్లింగ్ ముఠా సంప్రదింపులు జరిపింది. రాయలపేటలో ఆంజనేయస్వామిగుడి దగ్గరకు వస్తే తమ దగ్గర ఉన్న మహిమ గల చెంబు ఇస్తామని నమ్మబలికారు. చెంబు దక్కితే లక్కు నీదే.. అపర కోటీశ్వరుడవైపోతావని కేటుగాళ్లు చెప్పిna మాయ మాటలకు పడిపోయిన బాధితుడు.. ఎలాగైనా ఆ మహిమగల చెంబును దక్కించుకోవాలని.. 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా లక్ష చెల్లించి చెంబును తన సొంతం చేసుకున్నాడు. ఎంతో ఉత్కంఠతో.. అంతకుమించిన సంతోషంతో చెంబు పట్టుకొని ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత అది పనికిరాని చెంబని తేలడంతో బోరుమన్నాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేటుగాళ్లను పట్టుకుని అరెస్ట్ చేశారు. అత్యాశకు పోయి ఇలాంటి మోసగాళ్ల బారినపడి నష్టపోవద్దని పోలీసులు హితవు పలికారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా
ప్రొజెక్టర్ రూమ్‌లో చనిపోతే.. దొంగచాటుగా పుట్‌పాత్‌పై పడేస్తారా ??
రోబోను చూసి అడవి పందులు పరార్.. హైటెక్ ప్లాన్ అదిరిందిగా
ఒక్కరోజు వయసున్న క్యూట్ ‘రైనో’.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో