Reading Time: 2 minutes

Rukmini Vasanth: ‘డ్రాగన్’ బ్యూటీకి టాలీవుడ్లో మరో ఛాన్స్.. నాని ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా రుక్మిణి?

Caption of Image.

‘టాక్సిక్’, ‘డ్రాగన్’ చిత్రాలతో బిజీగా ఉన్న బ్యూటీ రుక్మిణీ వసంత్‌.. ఇప్పుడు తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌లో హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రం కోసం రుక్మిణి పేరును పరిశీలించగా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, హీరో ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, డైరెక్టర్ మురళీకాంత్ చెప్పిన స్టోరీ నానికి వీపరీతంగా నచ్చేసిందని టాక్. మరి ఈ సినిమాలో నాని కూడా హీరోగా నటించే ఛాన్సెస్ ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

నాని రేంజ్ డిఫరెంట్: రుక్మిణి

గతంలో రుక్మిణి ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్లో తనకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పేసింది. తెలుగులో మీకు ఏ హీరో అంటే  ఇష్టం? “ఎవరితో కలిసి నటించాలనుందని అడగానే, తనకు నేచురల్ స్టార్ నానితో (Nani)కలిసి పని చేయాలని ఉన్నట్లు తెలిపింది.

నాని రేంజ్ డిఫరెంట్ అని, అతను చేసే సినిమాల్లో ఒక అర్ధముంటోంది. అంటే సుందరానికీ, శ్యామ్ సింగరాయ్ లాగా ప్రతీ సినిమా కొత్తగా ఉండటంతో పాటూ ఆయన సినిమాల్లో హ్యూమర్ ఉంటుందని చెప్పింది. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ నుంచి వచ్చే సినిమా కోసం తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తెలుగు ఛాన్సెస్..

‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న రుక్మిణీ వసంత్.. ‘కాంతార: ఛాప్టర్ 1’తో బాలీవుడ్‌‌ దృష్టిని కూడా ఆకర్షించింది.  తన సహజ సిద్ధమైన నటనతో పాటు కళ్ళతోనే భావాలను పలికించే తీరు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.

ఈ క్రమంలోనే టాలీవుడ్‌‌లో సెటిల్ అవాలని వరుస సినిమాలు చేసేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌‌‌‌కు జంటగా ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ లో నటిస్తోంది. మరోవైపు శర్వానంద్‌‌కు జంటగా శ్రీను వైట్ల సినిమాలో కూడా ఛాన్స్‌‌ అందుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yash (@thenameisyash)

©️ VIL Media Pvt Ltd.