
NBK-Vivek Athreya: ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, స్టార్స్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుండగా.. మరికొందరు దర్శకులు, నిర్మాతలు బాలయ్యను నేరుగా కలిసి బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్ – టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కలిసి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో బాలయ్య-వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. క్లాస్, ఎంటర్‌టైనింగ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వివేక్ ఆత్రేయ.. మాస్ మైండ్‌సెట్ ఉన్న బాలకృష్ణను ఎలా చూపిస్తారనే సినీ ప్రేక్షకుల్లో, బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని రేకిస్తుంది. ఇప్పుడు తాజాగా మైత్రీ నిర్మాతతో కలిసి వివేక్ ఆత్రేయ.. బాలయ్యను కలవడంతో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైపోయిందని నందమూరి అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారనే ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.