Reading Time: < 1 minute
Gold And Silver Prices Jump Sharply In India 24k Gold Near Rs 1 49 Lakh Per 10 Grams

Gold and Silver Prices Jump Sharply in Hyderabad: వరుసగా రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరిగాయి. శుక్రవారం (జూన్ 12) దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర రూ.294 పెరిగి రూ.14,858కు చేరుకుంది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940 పెరిగి రూ.1,48,580గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.270 పెరిగి రూ.13,620కు చేరుకోగా.. 10 గ్రాముల ధర రూ.2,700 పెరిగి రూ.1,36,200కు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. గ్రాముకు రూ.221 పెరుగుదలతో రూ.11,144గా నమోదైంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,440కు చేరుకుంది.

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.5,000 పెరిగి.. రూ.2,65,000కు చేరుకుంది. దీంతో వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా అదనపు భారం పడనుంది. జూన్ 11న 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,564గా ఉండగా.. జూన్ 12న అది రూ.14,858కు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.13,350 నుంచి రూ.13,620కు చేరింది. అంతకుముందు జూన్ 11న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,130 తగ్గి రూ.1,45,640కు చేరగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,950 తగ్గి రూ.1,33,500 వద్ద నమోదైంది.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల పెరుగుదల, డాలర్ మారకపు విలువలో మార్పులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో దేశీయ మార్కెట్లో కూడా ధరలు హెచ్చుతగ్గులు ఎదుర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలను బట్టి బంగారం, వెండి ధరల్లో మరింత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ పెరుగుదల భారంగా మారనుంది.