
ICC Test Rankings: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా రిలీజ్ చేసిన వీక్లీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో పెద్ద ఊహించని మార్పులు జరిగాయి. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ టెస్టులో ఇంగ్లాండ్ 115 రన్స్ తేడాతో కిర్రాక్ విక్టరీ సాధించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ జో రూట్‌కు మాత్రం గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచులో రూట్ ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో తన నెంబర్ 1 టెస్ట్ బ్యాటర్ స్థానాన్ని కోల్పోయాడు. ఏకంగా రెండు స్థానాలు దిగజారి మూడో ప్లేస్‌కు పడిపోయాడు.
రూట్ అవుట్.. హ్యారీ బ్రూక్ ఈజ్ ద న్యూ కింగ్:
జో రూట్ ఫెయిల్ అవ్వడంతో అతని టీమ్‌మేట్, ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) అదరగొట్టి ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ 1 ప్లేస్‌ను కైవసం చేసుకున్నాడు. లార్డ్స్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ టీమ్ మొత్తం 140 రన్స్‌కే ఆలౌట్ అయినా.. బ్రూక్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 56 రన్స్ కొట్టాడు. మరోవైపు ఆస్ట్రేలియా రన్ మెషిన్ ట్రావిస్ హెడ్ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు.
ఆఫ్ఘన్‌పై సెంచరీ.. నెంబర్ 1గా శుభ్‌మన్ గిల్:
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్-ఆఫ్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్, 300 రన్స్ తేడాతో మైండ్ బ్లాక్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి 8వ ప్లేస్‌కు చేరుకున్నాడు. దీంతో ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక ర్యాంకింగ్ ఉన్న నెంబర్ 1 ఇండియన్ బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ ఒక స్థానం దిగజారి 9వ ర్యాంక్‌కు పడిపోయాడు.
బౌలింగ్‌లో బుమ్రా బాస్.. ఆల్‌రౌండర్లలో జడేజానే తోపు:
జస్ప్రీత్ బుమ్రా: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు రెస్ట్ తీసుకున్నా సరే.. కింగ్ జస్ప్రీత్ బుమ్రా తన వరల్డ్ నెంబర్ 1 టెస్ట్ బౌలర్ స్పాట్‌ను పక్కాగా కాపాడుకున్నాడు. ఆస్ట్రేలియా లెజెండ్స్ పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ కంటే బుమ్రానే టాప్‌లో దూసుకుపోతున్నాడు. ఇక
►ALSO READ | FIFA వరల్డ్ కప్ 2026 ఓపెనింగ్ సెర్మనీకి సర్వం సిద్ధం.. స్టార్ సెలబ్రిటీలతో గ్రాండ్ షో!
మ్యాట్ హెన్రీ: న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ లార్డ్స్ టెస్ట్ తర్వాత 4వ స్థానం నుంచి నేరుగా 7వ స్థానానికి పడిపోయాడు. దీనివల్ల స్కాట్ బోలాండ్, మార్కో జాన్సెన్, నోమన్ అలీలు ఒక్కో స్థానం పైకి లేచారు. ఇంగ్లాండ్ పేసర్ గస్ అట్కిన్సన్ ఏకంగా 7 స్థానాలు ఎగబాకి 10వ ప్లేస్‌తో టాప్-10 లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆల్‌రౌండర్స్: ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు.. ఆఫ్ఘన్ మ్యాచ్ ఆడకపోయినా రవీంద్ర జడేజానే వరల్డ్ నెంబర్ 1 టెస్ట్ ఆల్‌రౌండర్‌గా తన బాస్‌గిరిని కంటిన్యూ చేస్తున్నాడు.
A changing of the guard at the top of the rankings for Test batters following an action-packed Lord’s #WTC27 contest 😲https://t.co/23sRBOXo2L
— ICC (@ICC) June 10, 2026