
కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘ధర్మస్థల’ను కుదిపేసిన దారుణమైన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇది సౌత్ సినీ ఇండస్ట్రీలో కార్చిచ్చు రేపుతోంది. వందలాది మృతదేహాల సామూహిక ఖననం (Mass-Burial) ఆరోపణలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులోకి.. లేటెస్ట్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేరు అనూహ్యంగా తెరపైకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రకాష్ రాజ్ పేరు ఎందుకు వచ్చింది?
ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య అనే వ్యక్తి జూన్ 11న కర్ణాటక హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. అందులో కొందరు వ్యక్తుల ఒత్తిడి మేరకే తాను స్టేట్‌మెంట్లు ఇచ్చానని చెప్తూ.. ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడారని చిన్నయ్య సంచలన ఆరోపణలు చేశాడు. నువ్వు భయపడకు, జూలై 29న నేను వచ్చి నిన్ను గట్టిగా కౌగిలించుకుంటాను అని ప్రకాష్ రాజ్ తనకు హామీ ఇచ్చారంటూ పిటిషన్‌లో పేర్కొనడం పెను సంచలనంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రకాష్ రాజ్ క్లారిటీ..
దీంతో సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. తన పేరు చుట్టూ జరుగుతున్న నెగెటివ్ ప్రచారానికి చెక్ పెడుతూ ప్రకాష్ రాజ్ కన్నడ భాషలో ఒక పవర్‌ఫుల్ ట్వీట్ చేశారు. మీడియాలో, సోషల్ నెట్‌వర్క్స్‌లో ధర్మస్థల కేసు గురించి నన్ను ముడిపెడుతూ వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశం. నాపై వస్తున్న వార్తలకు సమాధానం చెప్పడం నా బాధ్యత. ప్రస్తుతం నేను కాస్త దూరంగా ఉన్నాను. మరో రెండు రోజుల్లో నేనే స్వయంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అన్ని నిజాలూ చెప్తాను. అంతవరకు కొందరు వెధవలు ఈ వార్తలకు జోడిస్తున్న రెక్కలను, పుకార్లను నమ్మకండిఅంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
ಎಲ್ಲರಿಗು ನಮಸ್ಕಾರ.. ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ… ಸಾಮಾಜಿಕ ಜಲತಾಣಗಳಲ್ಲಿ ಧರ್ಮಸ್ತಳ ಪ್ರಕರಣದ ಕುರಿತಂತೆ ನನ್ನ ಬಗ್ಗೆ ಕೆಲವು ಸುದ್ದಿ ಚರ್ಚಿಸಲ್ಪಡುತ್ತಿರುವು ನನ್ನ ಗಮನಕ್ಕೆ ಬಂದಿದೆ. ಇದು ಅತಿ ಸೂಕ್ಷ್ಮವಾದ .. ಮತ್ತು ಕೋಟ್ಯಾಂತರ ಭಕ್ತರ ನಂಬಿಕೆಗೆ ಧಕ್ಕೆ ತಂದಿರುವ ಪ್ರಕರಣವಾಗಿರುವುದರಿಂದ ..ಈ ರೀತಿಯ ಅನುಮಾನಗಳಿಗೆ ಉತ್ತರಿಸಬೇಕಾಗಿರುವುದು ನನ್ನ…
— Prakash Raj (@prakashraaj) June 12, 2026
అసలేంటి ఈ ధర్మస్థల దారుణం?
ఈ కేసు వెనుక ఉన్న నిజాలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 1995 నుండి 2014 మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలకు గురైన వందలాది మంది మహిళలు, స్కూల్ పిల్లల శవాలను బలవంతంగా పూడ్చిపెట్టేలా తనను అప్పటి యాజమాన్యం వేధించిందని ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT) రంగంలోకి దిగి, ఆ కార్మికుడు చూపించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా అస్థిపంజరాలు బయటపడ్డాయి.
అయితే, పంచాయతీ అధికారులు మాత్రం అవి గుర్తుతెలియని అనాథ శవాలని చెప్తున్నారు. ఈ క్రమంలో ఈ భారీ కుట్ర వెనుక ప్రకాష్ రాజ్ లాంటి నటుడి పేరు బయటకు రావడం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మరి రెండు రోజుల్లో ప్రకాష్ రాజ్ ఎలాంటి బాంబ్ పేలుస్తారో చూడాలి..