Reading Time: 2 minutes

కరువు కాలం కమ్ముకొస్తుంది : ఎల్ నినో వచ్చేసినట్లు ప్రకటించిన IMD

Caption of Image.

భారతదేశానికి కరువు కాలం కమ్ముకొస్తుంది. నైరుతి రుతు పవనాల రాకతో వర్షాలు పడతాయి.. వ్యవసాయం బాగుంటుందని ఆశిస్తున్న రైతులకు ఇది బ్యాడ్ న్యూస్. ఎల్ నినో వచ్చేసిందని.. ఈ రుతు పవనాల సమయంలో అది మరింత బలపడుతుందని భాతర వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో ఎల్ నినో ప్రారంభం అయినట్లు జపాన్ వాతావరణ సంస్థ (JMA) జూన్ 11వ తేదీన అధికారికంగా ప్రకటించటం విశేషం. 

ఎల్ నినో అంటే ఏంటీ..?

పసిఫిక్ సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగటాన్ని ఎల్ నినో అంటారు. సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత సహజంగా 3.4 డిగ్రీలుగా ఉంటుంది. ఇప్పుడు అది పాయింట్ 5 శాతం పెరిగింది. అంటే సముద్రం నీరు ఉండాల్సిన వేడి కంటే అధిక వేడిగా ఉన్నాయి. దీన్ని ఎల్ నినో అంటారు. జూన్ నుంచి ఆగస్ట్ మధ్య కాలంలో ఎల్ నినో మరింత బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూలై మధ్య నుంచి తూర్పు పసిఫిక్ అంతటా విస్తరిస్తుందని.. ఇదంతా రుతు పవనాల కాలంలోనే జరుగుతుందని స్పష్టం చేస్తుంది వాతావరణ శాఖ నివేదిక. 

ఎల్ నినో ప్రభావం ఎలా ఉంటుంది..?

సహజంగా నైరుతి రుతు పవనాల సీజన్ లో చల్లటి వాతావరణంతోపాటు నికరంగా వర్షాలు పడతాయి. ఎల్ నినో ప్రభావంతో సముద్రం నీరు వేడెక్కటం వల్ల సముద్రం నుంచి భూమిపైకి వేడి గాలులు వీస్తాయి. భూమిపై ఎక్కువగా పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వర్షపాతం తక్కువగా ఉంటుంది. దీంతో కరువు వస్తుంది.  దీనికితోడు అక్కడక్కడ కుండపోత వర్షాలు ఉంటాయి. క్లౌడ్ బరస్టులు ఉంటాయి. దీని వల్ల విపత్తలు వచ్చే ప్రమాదం ఉంది. 

►ALSO READ  | బాదంపప్పులు తింటే షుగర్ రాదా?… అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే

వర్షాలు తక్కువగా ఉండటం వల్ల నీళ్ల కొరత ఏర్పడుతుంది. మంచి నీళ్లకు.. సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యవసాయానికి అవసరం అయిన నీళ్లు లేక పంటలు పండవు. ఆదాయం లేక రైతులు, రైతు కూలీలకు ఇబ్బంది వస్తుంది. ఎల్ నినో అధికారంగా ప్రారంభం అయిన భారత వాతావరణ శాఖ ప్రకటనతో ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రైతులు పంటలు సాగు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 

©️ VIL Media Pvt Ltd.