Reading Time: 2 minutes

ఉదయం ఆరు గంటల అలారంతో మొదలయ్యే పరుగు.. రాత్రి బెడ్ రూమ్ లైట్ ఆపే వరకు ఆగదు. ఒకవైపు ల్యాప్‌టాప్ స్క్రీన్, ఇంకోవైపు వంటగది స్టవ్.. ఒకవైపు ప్రెజెంటేషన్ టెన్షన్, మరోవైపు పిల్లల హోంవర్క్. ఈ రోజుల్లో చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్న మహిళల దినచర్య ఇది. బయటి ప్రపంచంలో సక్సెస్ సాధిస్తున్నా.. ఇటు ఇల్లు, అటు ఆఫీస్ బ్యాలెన్స్ చేయడం నేటి మహిళకు ఒక కత్తిమీద సాములా ఎందుకు మారింది? అసలు ఎక్కడ సమస్య వస్తోంది?..చూద్దాం

డబుల్ షిఫ్ట్’ భారం : ఆఫీస్‌లో పురుషులతో సమానంగా 8 నుండి 9 గంటలు పనిచేసి ఇంటికి వచ్చినా.. వంట, క్లీనింగ్, పిల్లల బాధ్యతలు వంటి ‘అన్‌పెయిడ్ వర్క్’ (సారూప్య రహిత శ్రమ) మహిళలే చేయాల్సి రావడం.

మెంటల్ లోడ్: కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు.. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంది, రేపు కూరగాయలు ఏం తేవాలి, పిల్లల వ్యాక్సినేషన్ ఎప్పుడు.. ఇలాంటి వంద ఆలోచనల మైండ్ ప్రెజర్ (Mental Exhaustion) మహిళల పైనే ఎక్కువగా ఉంటోంది.

సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం: ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి, మైక్రో ఫ్యామిలీస్ పెరగడం వల్ల పిల్లలను చూసుకోవడానికి నమ్మకమైన సపోర్ట్ దొరకడం లేదు.

‘పర్ఫెక్ట్’గా ఉండాలనే ఒత్తిడి: అటు ఆఫీస్‌లో బెస్ట్ ఎంప్లాయ్ అనిపించుకోవాలి, ఇటు ఇంట్లో పర్ఫెక్ట్ హోమ్ మేకర్ అనిపించుకోవాలనే ‘గిల్ట్ ఫీలింగ్’ (ఆత్మన్యూనత) వారిని మరింత ఒత్తిడికి గురిచేస్తోంది.

ఆరోగ్య సమస్యలు: ఇక శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోవడం, సరైన సమయానికి తినకపోవడం, నిద్రలేమి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బీపీ, స్ట్రెస్ పెరగడం.

The Modern Woman’s Challenge: Managing Career and Family Without Burnout
The Modern Woman’s Challenge: Managing Career and Family Without Burnout

పరిష్కారాలు: బాధ్యతల పంపకం ముఖ్యం. “ఇంటి పని కేవలం మహిళలదే కాదు” అనే మైండ్‌సెట్ మారాలి. భర్త, కుటుంబ సభ్యులు పనులను పంచుకోవాలి.

నో’ చెప్పడం నేర్చుకోవడం: ఆఫీస్‌లో లేదా ఇంట్లో తమ శక్తికి మించిన పనులు వచ్చినప్పుడు సున్నితంగా తిరస్కరించడం అలవాటు చేసుకోవాలి. ఇక రోజులో కనీసం 30 నిమిషాలు తమకు నచ్చిన హాబీస్ లేదా విశ్రాంతి కోసం కేటాయించుకోవాలి.

టెక్నాలజీ & స్మార్ట్ హెల్ప్: వాషింగ్ మెషీన్స్, డిష్‌వాషర్స్ వంటి గ్యాడ్జెట్స్‌ను వాడుకోవడం లేదా వంట/క్లీనింగ్ కోసం హెల్పర్స్ (Med)ను నియమించుకోవడం ద్వారా సమయం ఆదా అవుతుంది.

మహిళలు సూపర్‌ఉమెన్ కానక్కర్లేదు, అందరినీ మెప్పించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కెరీర్, ఫ్యామిలీ రెండూ ముఖ్యమే.. కానీ అన్నిటికంటే వారి మానసిక, శారీరక ఆరోగ్యం ముఖ్యం. కుటుంబాలు కూడా మహిళలను కేవలం బాధ్యతలు మోసే యంత్రాలుగా కాకుండా, తోటి భాగస్వాములుగా గుర్తించినప్పుడే ఈ ‘వర్క్-లైఫ్ బ్యాలెన్స్’ సాధ్యమవుతుంది.”

The post ఆఫీస్, ఇంటి బాధ్యతలు… మహిళలకు బ్యాలెన్స్ ఎందుకు కష్టమవుతోంది? appeared first on Manalokam – Latest Telugu News & Updates.