Reading Time: < 1 minute

SAIL రిక్రూట్‌మెంట్: బొకారో స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. బీటెక్, సీఏ చేసిన వారికి మంచి అవకాశం!

Caption of Image.

స్టీల్ అథారిటీ ఆఫ్​ ఇండియా బొకారో స్టీల్ ప్లాంట్ (బీఎస్ఎల్)లో యంగ్ ప్రొఫెషనల్స్ (వైపీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అభ్యర్థులు జూన్ 10 నుంచి జులై 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్ (వైపీ) – లెవల్ 1, లెవల్ 2, లెవల్ 3. 

ఎలిజిబిలిటీ: ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్ (రెగ్యులర్/ ఫుల్-టైమ్) కలిగి ఉండాలి.   ఫైనాన్స్ కన్సల్టెంట్ (వైపీ1): సీఏ/ సీఎస్/ సీఎంఏ పూర్తిచేసి ఉండాలి. కనీసం 3 నుంచి 10 ఏళ్ల అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 21 నుంచి 42 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 10.

అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.500 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: జులై 01. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ sailcareers.comను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.