
మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు చవి చూసింది. ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించి తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొందామె. అయితే ఎప్పుడూ తన గురించి కానీ తన లైఫ్ గురించి పెద్దగా మాట్లాడని శ్రీజ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. తన కష్టాల గురించి తొలి సారి పెదవి విప్పింది. చాలాకాలంగా తను అనుభవిస్తున్న ఆవేదనను బయటకు చెబుతూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. ‘నాకే ఎందుకిలా జరుగుతోంది? ఎందుకింత బాధ అనుభవిస్తున్నాను? ఒకదాని వెంట మరొకటి వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయేంటి? నేనేం పాపం చేశానని ఇంత మానసిక క్షోభ అనుభవిస్తున్నాను? అని చాలాకాలం నాలో నేనే మథన పడ్డాను. కానీ నెమ్మదిగా నేను బాధితురాలిని అనే భావన నుంచి నెమ్మదిగా బయటకు వచ్చాను. మన లైఫ్ ఏంటి.. ఇలా ఉంది అని బాధపడటానికి బదులుగా దాన్ని మార్చుకునేందుకు ఏం చేయగలం? అని తెలుసుకోవడమే అసలైన మార్పు. సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్ వల్ల నాలో మార్పు మొదలైంది. నా ఆలోచనల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు జీవితం ప్రశాంతంగా మారింది. నేనేంటో పూర్తిగా తెలుసుకున్నాను’
‘ఒకప్పుడు నా జీవితంలో జరిగిన తప్పులే నా గుర్తింపును నిర్ధారించాయనుకున్నాను. కానీ, అది తప్పని తెలుసు కున్నాను. బాధ నాలో ఒక భాగమే కానీ, అదే జీవితం కాదని తెలిసొచ్చింది. మనిషిలో ఇంకా ఎన్నో లేయర్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకోవడం బాగుంది’ అని చెప్పుకొచ్చింది శ్రీజ. ప్రస్తుతం మెగా డాటర్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఒక్కొక్కరు ఈ వీడియోపై స్పందిస్తున్నారు. శ్రీజకు సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు. మరో మెగా డాటర్ నిహారిక కొణిదెల స్పందిస్తూ.. ‘మై సూపర్ ఉమెన్’ అని కామెంట్ పెట్టింది.
శ్రీజ కొణిదెల షేర్ చేసిన వీడియో..
నిహారిక కొణిదెలతో శ్రీజ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి