
యాక్షన్ కింగ్ విశాల్ నుంచి సినిమా వస్తోందంటేనే హై-వోల్టేజ్ ఫైట్లు, అదిరిపోయే మైండ్ గేమ్స్ ఆశిస్తారు ఫ్యాన్స్. అయితే ఈసారి ఆయన కేవలం నటుడిగానే కాదు.. డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టి డబుల్ ధమాకా ఇవ్వడానికి రెడీ అయ్యారు. విశాల్ హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మకుటం’. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది.
టీజర్ ఎలా ఉందంటే?
‘కడలిని శ్వాసించేవాడు వేరు.. ఆ కడలినే శాసించేవాడు వేరు’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో టీజర్ మాస్ లెవల్‌లో ప్రారంభమైంది.. ముఖ్యంగా మండుతున్న శవం నుంచి సిగరెట్ వెలిగించుకుంటూ విశాల్ ఇచ్చే ఎంట్రీ సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో విశాల్ ఏకంగా మూడు వైవిధ్యమైన పాత్రల్లో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న గెటప్స్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఇక విజువల్స్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి.
సరికొత్త అవతారంలో అంజలి..
విశాల్, అంజలి కాంబినేషన్‌కు ఆల్రెడీ మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ చిత్రంలో అంజలి నెవ్వర్ బిఫోర్ అనేలా పూర్తి మాస్ యాక్షన్ అవతారంలో కనిపించి షాకిచ్చింది. ఆమెతో పాటు దుషార విజయన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తుండగా.. తంబి రామయ్య, అర్జై కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి అరసు ఈ చిత్రానికి అద్భుతమైన కథను అందించారు.
►ALSO READ | రూ. 370 బిర్యానీ తినిపిస్తే ఆ హక్కు వచ్చేస్తుందా? ముంబై పోలీస్ మీమ్‌పై ప్రియాంక చతుర్వేది ఫైర్!
ప్రతిష్టాత్మక చిత్రం..
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ పతాకంపై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఆ సంస్థకు ఇది 99వ చిత్రం .. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలైలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వన్ మ్యాన్ షోగా విశాల్ చూపించిన ఈ ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.