Reading Time: < 1 minute
Facebook Instagram Outage Users Face Global Disruption Meta Platforms Down

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌బుక్, ఇన్‌స్టా్గ్రామ్‌లకు సాంకేతిక అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం నుంచి సర్వర్లు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. హఠాత్తుగా పనిచేయడం మానేయడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షలాది మంది వినియోగదారులకు అసౌకర్యానికి గురవుతున్నారు. ఎందుకు పని చేయడం లేదో తెలియక అయోమయానికి గురవుతున్నారు.

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం నుంచి ఈ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వినియోగదారులు యాప్‌లను యాక్సెస్ చేయడంలోగానీ.. ఉపయోగించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పోస్టింగ్‌లు చేయడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరించాలని సంస్థలకు మెయిల్స్ పెడుతున్నారు.