
ప్రపంచంలోనే అత్యంత క్రేజీయెస్ట్ గేమ్.. ఎక్కువ మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఆట ఫుట్ బాల్. గ్రౌండ్ లో ఒక యుద్ధం మాదిరిగా ఆటగాళ్లు తలపడే ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. ఫీల్డ్ లో ఆటగాళ్లు ఎలా ఢీకొంటారు.. అంతకంటే ఎక్కువ వార్ ఫ్యాన్స్ మధ్య నడుస్తుంటుంది. అలాంటి ఫిఫా వరల్డ్ కప్ 2026 కు రంగం సిద్ధమైంది. 2026 జూన్ 12 (శుక్రవారం) నుంచి ఫిఫా పోరు మొదలవుతోంది.
ఫీఫా ప్రపంచ కప్ 2026 ఇండియాలో ప్రసారాలపై చాలా కాలం సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. కానీ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు, ఇండియాలో అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ గా ఫైనల్ అవ్వటంతో దేశంలో టెలివిజన్ , స్ట్రీమింగ్ ప్రసారాలపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది.
అగ్రీమెంట్ లో భాగంగా 2034 వరకు 38 ఫీఫా పోటీల హక్కులను కూడా జీ టెలివిజన్ పొందింది. దీంతో రాబోయే పదేళ్ల వరకు ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ప్రసార రంగంలో తన ఉనికిని మరింత పెంచుకున్నట్లయింది.
ప్రసార హక్కులతో పాటు, స్పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసుకుంది Zee TV. విస్తరణ వ్యూహంలో భాగంగా ఈ నెట్‌వర్క్ నాలుగు కొత్త స్పోర్ట్స్ ఛానెళ్లను ప్రారంభించింది. అవి యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్‌డి, యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్‌డి లను ప్రారంభించింది.
జీ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన జీ5, ప్రపంచ కప్ ప్రసారాన్ని రెండు ప్లాన్‌ల కింద అందిస్తోంది. ఒకటి 799 రూపాయలతో నడిచే మూడు నెలల ప్లాన్ , మరొకటి 1699 రూపాయలతో ఇయర్లీ ప్లాన్. అయితే జీ ఛానెళ్లు లేదా జీ5 అందుబాటులో లేని ప్రేక్షకులకు దూరదర్శన్ స్పోర్ట్స్ సెలెక్టెడ్ మ్యాచులను ప్రసారం చేయనున్నట్లు డీడీ ప్రకటించింది.
- DD స్పోర్ట్స్‌లో ప్రసారం అయ్యే మ్యాచులు ఇవే:
జూన్ 11న మెక్సికో, దక్షిణాఫ్రికా మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్‌ను డీడీ స్పోర్ట్స్ ప్రసారం చేయనుంది. ఈ మ్యాచ్ ఇండియాలో జూన్ 12న అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రసారం అవుతుంది.
దీని తర్వాత, క్వార్టర్ ఫైనల్స్, సెమీ-ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు DD ఫ్రీ డిష్‌లో అందుబాటులో ఉంటాయి. క్వార్టర్ ఫైనల్స్ జూలై 9, 10 మరియు 11 తేదీలలో జరగనున్నాయి.
సెమీఫైనల్స్ 14, 15 తేదీలలో జరుగుతాయి, ఫైనల్ జూలై 19న జరుగుతుంది.