
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ( జూన్ 12 ) తెల్లవారుజామున కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్ తో కలిసి తిరుమల చేరుకున్నారు ముఖేష్ అంబానీ.
ఈ క్రమంలో టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముఖేష్ అంబానీ కుటుంబానికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబంతో కలిసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖేష్ అంబానీ.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు అంబానీ ఫ్యామిలీకి ఆశీర్వచనం అందించగా.. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.