Reading Time: < 1 minute

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గ్యాస్ లీకై ముగ్గురికి గాయాలు

Caption of Image.

కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఓ ఇంట్లో వంట చేస్తుండగా, గ్యాస్​ లీకై​ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లా కేంద్రంలోని వినాయక్​నగర్​ కాలనీలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్  లీక్​ అయింది. 

మంటలు చెలరేగడంతో మల్లవ్వ, మౌనిక, ఆలేఖ్యకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి  ఫైర్​ సిబ్బంది​చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని గవర్నమెంట్​ హాస్పిటల్​కు తరలించారు. మంటలు అదుపులోకి రావడంతో భారీ ప్రమాదం తప్పింది.

©️ VIL Media Pvt Ltd.