Reading Time: < 1 minute

తల్లి, ముగ్గురు పిల్లలు మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..కామారెడ్డి జిల్లాలో ఘటన

Caption of Image.

కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు : ముగ్గురు పిల్లలతో కలిసి ఓ మహిళ కనిపించకుండా పోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో గురువారం వెలుగుచూసింది. టౌన్ సీఐ నరహరి తెలిపిన ప్రకారం… రాజంపేట మండలం కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన యాడారం లయ అలియాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్యామల తన కూతుళ్లు బిందు, దివిజ, కొడుకు శివతో కలిసి షాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసమని బుధవారం కామారెడ్డి వచ్చారు. అక్కడి నుంచి కామారెడ్డిలోనే ఉండే తన తమ్ముడి ఇంటికి వెళ్లింది.

 సాయంత్రం సొంతూరికి వెళ్తానని బయలుదేరిన శ్యామల, ముగ్గురు పిల్లలు రాత్రి అయినా ఇంటికి చేరలేదు. దీంతో శ్యామల భర్త భానుప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం ఉదయం కామారెడ్డి టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఏరియాల్లో వెదికినా ఆచూకీ దొరకలేదు. కుటుంబ కలహాల కారణంగానే నలుగురు కనిపించకుండా పోయారని అనుమానిస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.