Reading Time: 2 minutes
మార్నింగ్ ఈ 4 విషయాల గురించి అస్సలు మాట్లాడొద్దు.. భార్యభర్తల మధ్య గొడవలకు కారణం ఇదేనట!

మనం నిద్ర లేచిన వెంటనే డే ఎలా స్టార్ అవుతుంతో అనే దాన్ని బట్టే.. ఆరోజు మొత్త మనకు ఎలా గడుస్తుందనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా, భార్య భర్తల మధ్య ఉదయాన్నే సాగే మొదటి సంభాషణ, వారి జీవితకాల బంధాన్ని నిర్ణయించే శక్తిని కలిగి ఉంటుంది. నేటి ఉరుకులు పరుగుల జీవితం, వర్క్ టెన్షన్ కారణంగా.. చాలా మంది భార్యాభర్తలు మార్నింగ్ లేచిన వెంటనే గొడవ పడడం చేస్తున్నారు. ఇటువంటి ప్రతికూల అలవాటు దీర్ఘకాలంగా కొనసాగితే , అది కాలక్రమేణా విడిపోవడానికి లేదా విడాకులకు దారితీస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

గతంలోని చేదు జ్ఞాపకాలను తవ్వి తీయడం

మార్నింగ్ లేవగానే గతంలో జరిగిన గొడవల గురించి మాట్లాడటం భార్యభర్తల మధ్య తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అప్పుడు మీరు చేసిన తప్పు వల్లే ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చాయనే ఆరోపణలు భాగస్వామి మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. ఇటువంటి మాటలు ఉదయపు సానుకూల వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేసి, ఇద్దరి మధ్య ద్వేశాన్ని పెంచుతాయని చెబుతున్నారు. కాబట్టి ఉదయాన్నే గతంలో జరిగిన గొడవల గురించి ఎప్పుడూ మాట్లాడకపోవడం ఉత్తమం.

ఇతరులతో పోల్చి మాట్లాడటం

ఈ భూమ్మీద పుట్టిన ఒక్కో వ్యక్తి ఒక్కోలా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కో ట్యాలెంట్ ఉంటుంది. ఇది ప్రతి భార్యభర్తలు గుర్తుంచుకోవాలి. అలా కాకుండా, ఉదయాన్నే తమ భాగస్వాములను పక్క వారితోనో లేదా బంధువులతోనో పోల్చి తక్కువ చేసి మాట్లాడతే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీనట్టు అవుతుంది. ఇది భార్యభర్తల మధ్య దూరాన్ని పెంచే ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పుడూ మీ భాగస్వాములను ఇతరులతో పోల్చకండి.

ఆర్థిక ఇబ్బందులు, బడ్జెట్ చర్చలు

నెలవారి ఖర్చుల గురించి భార్యభర్తలు కలిసి మాట్లాడుకోవడం మంచిదే అయినప్పటికీ.. ఆ చర్చలు ఏ సమయంలో జరుపుతున్నామనేది చాలా ముఖ్యం.
ఉదయాన్నే కాఫీ తాగే సమయంలో ఈ ఆర్థిక లావాదేవీల గురించి అస్సలు మాట్లాడకూడదు. ఇది ఇద్దరిలోనూ ఆ రోజటి ఉత్సాహాన్ని నీరుగారుస్తుంది. ఇటువంటి ఆర్థికపరమైన సవాలుతో కూడిన చర్చలను సాయంత్రం వేళల్లో లేదా వారాంతాల్లో ప్రశాంతంగా మాట్లాడుకోవడం మంచిది.

రోజువారీ పనుల్లో తప్పులు ఎంచడం

మార్నింగ్ ఆఫీస్‌కు లేట్ అవుతుందనే కంగారులో ఒకరినొకరు తిట్టుకోవడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నువ్వు ఎప్పుడూ ఇంతే, ఏ పనినీ సరిగ్గా చేయవు అనే చిన్న చిన్న పదాలు కూడా మీ భాగస్వాముల గుండెల్లో లోతైన గాయాలు చేయొచ్చని చెబుతున్నారు. ఇటువంటి అనవసరమైన విమర్శలు, మాటల యుద్ధాలు భాగస్వాముల మనఃశాంతిని దూరం చేయడమే కాకుండా.. వారి పనుల్లో కూడా అంతరాయం కలిగించవచ్చు. కాబట్టి వీలైనంత వరకు మార్నింట్ సమయంలో ఇలాంటి సంబాషణలకు దూరంగా ఉండండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.