
- ప్రస్తుతం 72 మార్కులతో పాస్
కోరుట్ల, వెలుగు : మావోయిస్ట్ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఇంటర్ పాస్ అయ్యారు. నాలుగు దశాబ్దాల క్రితం మధ్యలో ఆగిపోయిన చదువును తిరిగి ప్రారంభించిన ఆయన.. ఇంటర్ పూర్తి చేయడమే కాకుండా, లాసెట్‌లోనూ ర్యాంకు సాధించారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన దేవ్‌జీ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1983-– 85లో ఇంటర్ చదివారు. ఆ సమయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పేపర్‌ను బహిష్కరించారు. మిగతా అన్ని సబ్జెక్టుల్లో పాసైన దేవ్‌జీ తెలుగు పేపర్ మాత్రం మిగిలిపోయింది.
ఇటీవల లొంగిపోయిన దేవ్‌జీ ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని మే 13న తెలుగు పేపర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాశారు. గురువారం విడుదలైన ఫలితాల్లో 72 మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఇంటర్మీడియట్‌లో మొత్తం 614 మార్కులు సాధించినట్లైంది. అలాగే ఇటీవల నిర్వహించిన లాసెట్‌లోనూ దేవ్‌జీ 349వ ర్యాంకు సాధించారు. ఇంటర్ పూర్తి కావడంతో లా చదివేందుకు అర్హత సాధించారు.