Reading Time: < 1 minute
Why Ram Charans Rc17 With Sukumar Is Delayed After Peddi Release

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పెద్ది సినిమా రిలీజ్ అయి థియేటర్స్ లో రన్ అవుతోంది. దీంతో రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చ మొదలైంది. ఇప్పటికే ఆర్సీ 17ని సుకుమార్ దర్శకత్వంలో ప్రకటించారు చరణ్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్ కావడంతోఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. అయితే పెద్ది సినిమా విడుదలైన వెంటనే ఆర్సీ 17 షూటింగ్ ప్రారంభమవుతుందని అనుకున్నారు. కానీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. దానికి కారణం లేకపోలేదు.

గతంలోలాగా ఒక సినిమా పూర్తి కాగానే వెంటనే మరో సినిమా మొదలు పెట్టకుండా.. కాస్త సమయం తీసుకొని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడట చరణ్. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను నిదానంగా, పర్ఫెక్ట్‌గా పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఆర్సీ17 డిలే అవడానికి మరో బలమైన రీజన్ మాత్రం.. రామ్ చరణ్ సర్జరీ అని తెలుస్తోంది. ‘పెద్ది’ సినిమాలో కుస్తీ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చరణ్ చేతికి గాయాలయ్యాయి. ఆ సమయంలో సినిమా ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో అలాగే షూటింగ్ పూర్తి చేశాడు చెర్రీ. ప్రస్తుతం పెద్ది విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండటంతో చరణ్ తన చేతికి ఒక చిన్న సర్జరీ చేయించుకోబోతున్నట్లు సమాచారం. ఈ సర్జరీ పూర్తయిన తర్వాత వైద్యుల సలహా మేరకు చరణ్ పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. దాదాపు మూడు నెలల పాటు రెస్ట్‌ తీసుకునే ఛాన్స్ ఉందని టాక్. ఈ బ్రేక్ తర్వాతే RC17 పై పూర్తి దృష్టి పెట్టనున్నారట. మరోవైపు, ఈ గ్యాప్‌లో దర్శకుడు సుకుమార్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు.