Reading Time: 2 minutes

వరల్డ్ కప్ ముందు ఇరాన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా.. ఫ్యాన్స్‌కు మాత్రం షాక్!

Caption of Image.

FIFA World Cup 2026: మరో రెండు రోజుల్లో మెగా ఈవెంట్ ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) స్టార్ట్ కాబోతున్న తరుణంలో ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. ప్రస్తుతం మెక్సికోలోని టిజువానాలో ప్రాక్టీస్ చేస్తున్న ఇరాన్ టీమ్.. మ్యాచ్ జరిగే రోజు మాత్రమే అమెరికాలోకి ఎంట్రీ ఇచ్చి, మ్యాచ్ అయిపోగానే అదే రోజు వెళ్ళిపోవాలంటూ రూల్స్ పెట్టారని మొదట వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తిప్పికొట్టింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందే ఇరాన్ జట్టు అమెరికాకు చేరుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

ఒక్క రోజు ముందే ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్
మెక్సికోలో ఉన్న ఇరాన్ అంబాసిడర్ అబూల్ఫజల్ పసందిదేహ్ మాట్లాడుతూ.. ఇరాన్ టీమ్ మ్యాచ్ రోజే అమెరికాకు వచ్చి అదే రోజు రిటర్న్ వెళ్లాలని రూల్స్ పెట్టారంటూ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. దీనివల్ల ప్లేయర్ల ప్రయాణ ఇబ్బందులు పెరిగి పర్ఫార్మెన్స్ దెబ్బతింటుందని ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. కానీ అమెరికా అధికారులు ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఉదారత వల్ల ఇరాన్ టీమ్ తమ మ్యాచ్‌లకు ఒక రోజు ముందే అమెరికా చేరుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో ఇరాన్ టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉన్న సస్పెన్స్ వీడింది. 

ఫ్యాన్స్ టికెట్లు క్యాన్సిల్:  
టీమ్‌కు ప్రయాణ అనుమతులు దక్కినా.. ఇరాన్ ఫ్యాన్స్‌కు మాత్రం పెద్ద షాక్ తగిలింది. వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు కొద్దిరోజుల ముందే ఇరాన్ దేశానికి కేటాయించిన టికెట్ల కోటాను ఫిఫా వెనక్కి తీసుకుంది. అప్పటికే అఫీషియల్ ప్రాసెస్ ద్వారా టికెట్లు కొనుక్కుని, మ్యాచ్‌లు చూడటానికి ట్రావెల్ బుకింగ్స్ కూడా చేసుకున్న వందలాది మంది ఇరాన్ ఫ్యాన్స్ ఇప్పుడు మ్యాచ్‌లు చూసే ఛాన్స్ కోల్పోయారు.

ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఫైర్:
ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇరాన్ మస్తు సీరియస్ అయింది. ఇరాన్ అభిమానులకు దక్కాల్సిన అధికారిక టికెట్లను లాగేసుకోవడం అంతర్జాతీయ పోటీల స్ఫూర్తికి, దేశాల సమానత్వ సూత్రానికి పూర్తిగా విరుద్ధమని ఒక స్టేట్‌మెంట్‌ జారీ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ ఈవెంట్ నిర్వహణలో క్రీడలకు సంబంధం లేని పొలిటికల్ విషయాలు ఇంటర్ఫియర్ అవుతున్నాయంటూ వారు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇరాన్ మ్యాచ్‌ల షెడ్యూల్
* జూన్ 16న లాస్ ఏంజెల్స్‌లో న్యూజిలాండ్‌తో ఇరాన్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది
* జూన్ 22న బెల్జియం జట్టుతో తలపడుతుంది
* జూన్ 27న సీటెల్‌లో ఈజిప్ట్ టీమ్‌తో లాస్ట్ గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది 

©️ VIL Media Pvt Ltd.