
నవగ్రహాలకు రారాజు సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్న సూర్యుడు మిథునరాశిలోకి జూన్ 15 అర్ధరాత్రి 2:07 గంటలకు ( తెల్లవారితే జూన్ 16) ప్రవేశిస్తున్నాడు. సూర్య భగవానుడురాశిని మార్చడం వల్ల ఐదు ( మేషం, మిథునం,సింహ, తుల, ధనస్సు, కన్య) రాశుల అదృష్టాన్ని ప్రకాశవంతం చేయవచ్చు. మిథునరాశిలోకి సూర్యుని ప్రవేశం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మేషరాశి : ఈ రాశిపై సూర్యుడు రాశి మార్పు చాలా అధికంగా ఉంటుంది. మిథన రాశిలో సంచరించడం వలన అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. కొత్తగా ఇల్లు కట్టేందుకు అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏ పని చేసినా అందులో విజయం అందుకుంటారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. పనిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.
వృషభరాశి: ఈ రాశి వారు జూన్ 16 నుంచి నెల రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ మీ మాటలతో బాధపెట్టకండి, మీరు చేసే చిన్న తప్పులే, మీ జీవితంలో అనేక సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. ఈ రాశి వారు అనవసరమైన వాదనలు పెట్టుకోవద్దు. ప్రతి విషయంలో ఓర్పు .. సహనం పాటించండి. సహోద్యోగులతో కలిసి పనిచేయండి. కుటుంబసభ్యుల మద్దతు ఉండడంతో మానసికప్రశాంతత ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితిలో కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దు. ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోండి. ప్రేమ వ్యవహారాలను వాయిదా వేయండి.
మిథునరాశి: ఇదే రాశిలో సూర్యుడు సంచరించడం వలన మీరు చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండాపూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న సమయానికే పనులు పూర్తవుతాయి. కెరీర్ విషయంలో మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.. కొత్త అవకాశాలు లభిస్తాయి. . భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ప్రేమ … పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.
కర్కాటకరాశి: ఈ రాశి వారికి పన్నెండవ ఇంటిలో సూర్యుడి సంచారం వలన కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు . ఖర్చులు పెరుగుతాయి. ఆందోళన పెరగడం, సమస్యలు ఎక్కువ అవడం జరుగుతుందంట.పూర్వీకులకు సంబంధించి ఆస్తి వివాదాల్లో చాలా సంయమనం పాటించండి. కొంతవరకు పరిష్కారమవుతాయి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఎలాంటి ఆందోళన పడకుండా ఇష్ట దైవాన్ని స్మరించుకోండి.. అంతా మంచే జరుగుతుంది.
సింహరాశి:ఈ రాశికి అధిపతి సూర్యుడు. మిథున రాశిలో సూర్యుడు సంచారం వలన ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మొండి బకాయిలు వసూలవుతాయి. పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆఫీసులో పనికి తగిన గుర్తింపు పొందుతారు. సీనియర్ల మద్దతు లభిస్తుంది. కుటుంబ సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అపారమైన విజయాలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. . .
కన్యారాశి: సూర్యుడు మిథున రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలుంటాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో హోదా.. గౌరవం.. కీర్తి .. ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది.ఉద్యోగస్తులకు ప్రమోషన్‌తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
తుల రాశి: సూర్యుడు .. మిథునరాశిలో సంచరించడం వలన ఈ రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్థులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన లావాదేవీలు పరిష్కారమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకొనేటప్పుడు మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి. అంతా మంచే జరుగుతుంది.
వృశ్చికరాశి: మిథున రాశిలో సూర్య సంచారం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఒకటి అనుకుంటే మరొకటి జరిగే అవకాశం ఉంది. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారే ఛాన్స్ ఉన్నందున చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు.. ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. వ్యాపారస్తులు సంయమనం పాటించండి. ఉద్యోగస్తులు అనవసరంగా మాటపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ధనస్సురాశి: సూర్యుడు మిథున రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్ఠలు పెరుగుతాయి. అన్నీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఎప్పటి నుంచో పూర్తి కాలేకపోయిన టాస్కులను ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు . కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి అవార్డులు అందుకుంటారు. . వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే ఆశించిన లాభాలు కలుగుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది . ఆరోగ్యం మెరుగు పడుతుంది. . కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని పండితులు చెబుతున్నారు
మకరరాశి: సూర్యుడు మిథున రాశిలో సంచరించడం వలన ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాని కష్టపడాల్సి ఉంటుంది. ప్రతి పని కూడా సవాళ్లతో పూర్తి చేస్తారు. మీరు చేపట్టిన పనులు మొదట్లో ఆందోళన కలిగినా.. చివరకు పూర్తి చేస్తారు. ఆఫీసులో మీరే కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం పట్ల ప్రత్యే శ్రద్ధ పెట్టాల్సిన సమయమని పండితులు చెబుతున్నారు. పెళ్లి సంబంధాలు చూసేవారు గుడ్ న్యూస్ వింటారు.
కుంభరాశి: ఈ రాశివారు చాలా బిజీబిజీగా గడుపుతారు. కష్టాన్ని నమ్ముకుంటే ముందుకెళతారు. కొత్తగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తోటి ఉద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ … పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయి.
మీన రాశి: ఈ రాశి వారికి రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కొత్త వెంచర్లు ప్రారంభిస్తారు. వ్యాపారవేత్తలకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కృషికి తగిన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపు చేసే అవకాశం ఉంటుంది. వృత్తి, సామాజిక స్థాయిలో పురోగతిని ఇస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. కానీ వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు మీకు బలాన్నిస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.