
Silver Price: ప్రస్తుతం బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గుతోంది. గతంలో కేజీ సిల్వర్ ధర రూ.4 లక్షల వరకు వెళ్లగా, ప్రస్తుతం మాత్రం సగానికిపైగా తగ్గిపోయింది. జూన్ 11వ తేదీన వెండి ధర భారీగా తగ్గింది. ఒక కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 2,50,000 పలుకుతోంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్ లో ఒక ఔన్స్ సిల్వర్ ధర 63 డాలర్లు పలుకుతోంది. సిల్వర్ ధరలు మార్కెట్లో భారీగా తగ్గుతున్నాయి. గడచిన వారం రోజులుగా గమనించినట్లయితే సిల్వర్ ధర దాదాపు 15 శాతం వరకు తగ్గినట్లు చూడవచ్చు. నెల రోజుల కిందట మే 12న కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద ఉంది.
ప్రస్తుతం జూన్ 12న అంటే నెల రోజుల తర్వాత కేజీ సిల్వర్ ధర భారీగా పడిపోయింది. ఏకంగా 40 వేల రూపాయల వరకు పడిపోయింది. అదే సరిగ్గా గత వారం కిందట కాస్త పెరిగి 2,70,510 పలికింది. అక్కడ నుంచి సిల్వర్ ధర దాదాపు 20 వేల రూపాయల వరకు తగ్గినట్టు చూడవచ్చు. జూన్ 12న ఉదయం కిలో వెండి ధర రూ.2,50,000లకు చేరుకుంది.
అదే మే 20వ తేదీన రూ.2,80,000 వద్ద కొనసాగుతుండగా, అదే మే 31న, జూన్ 1న కూడా ఇదే ధరతో ట్రేడయ్యింది. ఇక జూన్ 5వ తేదీన రూ.2,75,000లకు చేరుకుంది. ఇకపోతే జూన్ 11న రూ.2,50,000 వద్ద ట్రేడయ్యింది.
అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇరాన్‌పై అమెరికా జరిపిన కొత్త దాడుల కారణంగా ముడి చమురు ధరలు దాదాపు రెండు శాతం పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం, దీర్ఘకాలిక అధిక వడ్డీ రేట్లపై పెట్టుబడిదారుల ఆందోళనలను మరింత పెంచుతోంది. అమెరికా సైన్యం ఇరాన్‌లోని పలు లక్ష్యాలను ఛేదించింది. శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీపై ఇంత రహస్యం ఉంటుందా? ఎవ్వరికి తెలియని సీక్రెట్ ఇదే..!
ఇది కూడా చదవండి: Gold Price Today: రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి