
నివేదిక ప్రకారం, మహిళలు తమ భయాలు, బాధలు, నిరాశ, అసూయ వంటి భావాలను స్వేచ్ఛగా ఒకరితో ఒకరు పంచుకుంటారు. అలా భావాలను పంచుకోవడం వారి మధ్య స్నేహ బంధాలను బలపరుస్తుంది. ఈ బలమైన బంధాలు మహిళల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఒత్తిడిని తగ్గించి శ్రేయస్సును పెంచుతాయని ఆ నివేదిక లో ఉన్నట్లు అను తెలిపారు. తను మహిళల కోసం ప్రత్యేకంగా ట్రిప్స్ నిర్వహించడానికి అది కూడా ఒక ముఖ్య కారణం అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలోని ఓ భాగాన్ని ఆమె కోట్ చేస్తూ, “పురుషులు క్రీడలు, వర్తమాన వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే, మహిళలు కుటుంబం, ఆరోగ్యం వంటి వ్యక్తిగత విషయాలను ఎక్కువగా చర్చిస్తారనీ నమ్మకమైన స్నేహితులు ఉండటం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అను తెలిపారు. గతంలో కజిరంగాకు నిర్వహించిన రెండు ట్రిప్స్ ద్వారా మహిళల్లో మంచి స్నేహ బంధాలు ఏర్పడటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అను హాసన్ అన్నారు. ఆ స్ఫూర్తితోనే ఈ ఏడాది డిసెంబర్‌లో మరో ట్రిప్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అదే సమయంలో, ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను ఒంటరిగా చిలీకి వెళ్లిన సోలో బైక్ ట్రిప్ అనుభవాలను కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ ట్రిప్ నుంచి తాను నేర్చుకున్న పాఠాలను పంచుకున్నారు. ఆ యాత్రలో తాను ‘వోగ్ ర్యాలీ 300’ బైక్‌పై ప్రయాణించిన వీడియోను పోస్ట్ చేస్తూ, “దక్షిణ అమెరికాలో ఈ బైక్ రైడ్ తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి అనీ అన్నారు.