Reading Time: 2 minutes

రామ్ చరణ్ ‘పెద్ది’లో ఉల్లు యాప్ బోల్డ్ బ్యూటీ.. నెట్టింట మీమ్స్, ట్రోల్స్ వర్షం!

Caption of Image.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పెద్ది'(Peddi). బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న  ఈ స్పోర్ట్స్ డ్రామా భారీ అంచనాల మధ్య జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ. 345 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.. చరణ్ సోలో కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మిశ్రమ స్పందనను తెచ్చుకున్న ఈ మూవీ జాన్వీ పాత్రపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.. 

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఓ క్రేజీ ఓటీటీ బ్యూటీ మెరవడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ బ్యూటీ మరెవరో కాదు.. ‘ఉల్లు’ (Ullu) వెబ్ సిరీస్‌ల ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి, మోడల్ సారిక సలుంఖే (Sarika Salunkhe).

మహారాష్ట్రలోని సతారా ప్రాంతానికి చెందిన సారిక సలుంఖే.. సోషల్ మీడియాలో ‘జూనియర్ దివ్యభారతి’గా నెటిజన్ల మనసు దోచుకుంది. స్టార్ ప్రవాహ్‌లో ప్రసారమైన ‘పింకీ చా విజయ్ అశో’ అనే మరాఠీ సీరియల్‌లో ‘నిరి’ పాత్రతో నటిగా మంచి బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత ‘ఉల్లు’ యాప్‌లో వచ్చిన బోల్డ్ వెబ్ సిరీస్‌లు ‘నంబరీ’ (దిశా పాత్ర), ‘కాలా ఖట్టా’ (భోలి పాత్ర), ‘షౌకియా’ లలో తన గ్లామర్ పర్ఫార్మెన్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. ఇప్పటికే తెలుగులో ‘వరదరాజు గోవిందం’,  ‘మైకం’, ‘మిరాకిల్’ వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ.. లేటెస్ట్ గా’పెద్ది’ అలరించింది.

 

అయితే ఈ ‘పెద్దిస సినిమాలో ఈమె నటించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా స్క్రీన్‌పై బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్స్‌లో కనిపించే ఈ ఉల్లు పాప.. మెగా హీరో సినిమాలో మాత్రం ఊహించని లుక్‌లో సర్ప్రైజ్ చేసింది.  సినిమాలో రామ్ చరణ్ మెడల్స్ అందుకునే ఒక కీలకమైన ఎమోషనల్ సీన్‌లో సారిక కనిపిస్తుంది. విజేతలకు మెడల్స్ స్టేజిపైకి తీసుకువచ్చే సాంప్రదాయబద్ధమైన అమ్మాయిగా ఆమె ఈ సీన్‌లో పాల్గొంది. ఎలాంటి బోల్డ్ ఎలిమెంట్స్ లేకుండా, పద్ధతైన శారీ లుక్‌లో ఆమెను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. 

ALSO READ : అందాల ఆరబోతకు భారీ పారితోషకం..

గ్లామర్ డాల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సారిక, చరణ్ సినిమాలో ఇంత ట్రెడిషనల్ రోల్ చేయడం నిజంగానే ఒక క్రేజీ ట్విస్ట్ .. అయితే ఈ మూవీలో జాన్వీ పాత్రను చూపించిన విధానం చాలా ఆసభ్యకరంగా ఉందంటూ మహిళా సంఘాలు, సినీ సెలబ్రిటీలు తమ నిరసన గళాన్ని వినిపించారు. చివరకు జాన్వీ నటించిన కొన్ని సీన్స్  కూడా మేకర్స్ తొలిగించాల్సి వచ్చింది. ఈ వివాదం ఇంకా ముగియకముందే.. ఓటీటీలో బోల్డ్  బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సారికను ఈతెలుగు సినిమాలో నటించడంపై ఫుల్ గా ట్రోల్స్, మీమ్స్  నడుస్తున్నారు. మేకర్స్ కు వేరే సినీ నటీమణులు ఎవరూ దొరకలేదా అంటూ విమర్శిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.