తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి.. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గి.. వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఈ రోజు (12 జూన్, 2026) వాయువ్య బంగాళాఖాతం మొత్తం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ & బీహార్, అలాగే ఒడిశా & జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. 12 జూన్, 2026 వ తేదీ నాటికి, నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 18° ఉత్తర అక్షాంశం /60° తూర్పు రేఖాంశం, 18° ఉత్తర అక్షాంశం /65° తూర్పు రేఖాంశం, 18° ఉత్తర అక్షాంశం /70° తూర్పు రేఖాంశం, హర్నై, సోలాపూర్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కళింగపట్నం, 21.5° ఉత్తర అక్షాంశం /89° తూర్పు రేఖాంశం, 23° ఉత్తర అక్షాంశం /90° తూర్పు రేఖాంశం, రాయ్‌గంజ్, 26° ఉత్తర అక్షాంశం /87° తూర్పు రేఖాంశం, మధుబని, 28.5° ఉత్తర అక్షాంశం /83° తూర్పు రేఖాంశం గుండా విస్తరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ & పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, ఒడిశా, జార్ఖండ్ & బీహార్‌లోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఉత్తర కోస్తా తమిళనాడు పై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉత్తర కోస్తా తమిళనాడుపై కేంద్రీకృతమై ఉంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా దాదాపుగా 11° ఉత్తర అక్షాంశం వద్ద గాలుల కోత విస్తరించి ఉంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అలాగే కొనసాగుతోంది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :
శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

రాయలసీమ :-
శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
శనివారం, ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.