Reading Time: < 1 minute

బాదంపప్పులు తింటే షుగర్ రాదా?… అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే

Caption of Image.

ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ప్రీడయాబెటిస్ ఒకటి. రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంకా టైప్ 2 డయాబెటిస్ స్థాయికి చేరుకోని సిచ్యువేషన్ ను ప్రీడయాబెటిస్ అంటారు.. అంటే షుగర్ వచ్చేందుకు ముందు దశ ఇది. ప్రీడయాబెటిస్ ను నిర్లక్ష్యం చేస్తే.. షుగర్, గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ప్రీడయాబెటిస్ కంట్రోల్ చేయడం ఎలా? అంటే సరైన ఆహారం, జీవన శైలిలో మార్పులతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు. 

తాజా అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ బాదంపప్పులు తినడం వల్ల ప్రీడయాబెటిస్ ఉన్నవారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంచుతాయని పరిశోధకులు గుర్తించారు.

బాదంపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, పీచుపదార్థం, విటమిన్-ఇ, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.

►ALSO READ | Women Health Tips: రోజూ ఈ డైట్ ఫాలో అవ్వండి.. 80 లో కూడా ఎముకలు గట్టిగానే ఉంటాయి

అలాగే బాదంపప్పుల్లోని ప్రోటీన్, పీచుపదార్థం ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేసి భోజనం తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తాయి. మెగ్నీషియం ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో సహకరిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

నిపుణుల సూచనల ప్రకారం, ప్రాసెస్డ్ స్నాక్స్‌కు బదులుగా బాదంపప్పులు వంటి పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. వీటిని నేరుగా స్నాక్‌గా తినడంతో పాటు సలాడ్లు, పెరుగు, ఓట్‌మీల్ వంటి ఆహారాల్లో కలిపి తీసుకుంటే బెటర్.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా ప్రీడయాబెటిస్‌ను నియంత్రించి భవిష్యత్తులో వచ్చే షుగర్ వచ్చే ప్రమాదంనుంచి బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు 

©️ VIL Media Pvt Ltd.