
తమిళనాడు పాలిటిక్స్ లోకి కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? దీనికి అవుననే సమాధానం వస్తుంది తమిళనాట. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా విజయ్ పగ్గాలు చేపట్టారు. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల రూల్స్ ప్రకారం వాటిల్లో ఒక సీటు వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విజయ్ ‘తిరుచ్చి’ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
టీవీకే పార్టీలోకి లారెన్స్?
ఇక్కడే అసలు కథ మొదలైంది. సీఎం విజయ్ ఖాళీ చేసిన ఆ స్థానం నుంచి ఆయన పెట్టిన ‘టీవీకే’ (తమిళగ వెట్రి కజగం) పార్టీ తరపున మాస్ మాస్టర్, కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ బరిలోకి దిగబోతున్నారంటూ కోలీవుడ్ లో ఒకటే టాక్ నడుస్తోంది. విజయ్, లారెన్స్‌ల మధ్య ఉన్న దోస్తీ అందరికీ తెలిసిందే. అందుకే లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. తిరుచ్చి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
అనౌన్స్‌మెంట్ వాయిదా ..
తన పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్‌కు తెరదించుతూ జూన్ 11న ఉదయం 9:30 గంటలకు ప్రకటిస్తానని లారెన్స్ గతంలో అనౌన్స్ చేశారు. కానీ, అంతలోనే తమిళ చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) బుధవారం కన్నుమూశారు. ఈ లెజెండ్ మరణంతో కోలీవుడ్ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. దీంతో లారెన్స్ భావోద్వేగానికి గురయ్యారు.
►ALSO READ | ఆడదంటే అంత చులకనా? ‘రూ.370 బిర్యానీ’ తినిపించి సుఖం కోరుకుంటారా? సెలబ్రిటీస్ ఫైర్!
భారతీరాజా సార్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉంది. ఇండస్ట్రీ అంతా ఇంతటి విషాదంలో ఉన్నప్పుడు నా వ్యక్తిగత, రాజకీయ ప్రకటన చేయడం సరంజసం కాదు. ఆయనపై ఉన్న గౌరవంతో నా బిగ్ అనౌన్స్‌మెంట్‌ను వాయిదా వేస్తున్నాను. ఈ నెల 12న (శుక్రవారం) ఉదయం 10:00 గంటలకు నా నిర్ణయాన్ని చెప్తాను అంటూ లారెన్స్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Hi everyone,
I had earlier informed you that I would be making an important life decision announcement on Thursday, the 11th, at 9:30 AM.
The industry is currently mourning the passing of Bharathiraja sir. This loss feels deeply personal, like losing a member of the family.… pic.twitter.com/eNfEG6LxRr
— Raghava Lawrence (@offl_Lawrence) June 10, 2026
లారెన్స్ రూట్ మారుస్తారా?
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ బ్యానర్‌లో ‘బెంచ్’ (Benz) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న లారెన్స్.. సరిగ్గా జూన్ 10తో తన షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ఇక తదుపరి టార్గెట్ పాలిటిక్సేనా అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. రాబోయే ఆరు నెలల్లో తిరుచ్చితో పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన మరో 5 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రానున్నాయి. దీంతో మరో సారి తమిళనాట రాజకీయం వేడెక్కింది.
ఒకవేళ లారెన్స్ గనుక విజయ్ పార్టీ తరపున తిరుచ్చి బరిలో దిగితే, తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారడం ఖాయం. మరి జూన్ 12న లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ మాస్ డైలాగ్ చెప్తారా? లేక ట్విస్ట్ ఇస్తారా? అనేది చూడాలి. ఇప్పటికే లారెన్స్ రాజకీయ ఎంట్రీపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.