ఇరాన్ , అమెరికా యుద్దం కారణంగా మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉదిక్తత క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పని అయిపోయింది.. ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనమైంది.. ఇక యుద్దం చేసే పరిస్థితిలో ఇరాన్ లేదు.. హార్ముజ్ జలసంధిలో మాదే ఆధిపత్యం.. నౌకల రాకపోకలు మా చేతుల్లోనే ఉన్నాయి.. ఇరాన్ ఆర్థికంగా కూడా పూర్తిగా నాశనమైంది.. ఇప్పుడు సైనికులకు జీతాలు చెల్లించుకోలేని పరిస్థితిలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ శాంతి ఒప్పందం చేసుకోవడం ఆలస్యం చేసింది..అందుకు భారీ మూల్యం చెల్లించుకుందంటూ ట్వీట్ చేశారు ట్రంప్.
The Fake News Media refuses to report how EFFECTIVE the U.S. Naval BLOCKADE is, the most successful Blockade in the history of Naval Warfare. NOTHING GETS THROUGH unless we want it to. IT IS A STEEL WALL! Iran is doing ZERO business, not paying their military, or any of their… pic.twitter.com/h6iCXBsznA
— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) June 10, 2026
ఇరాన్ సైన్యం పూర్తిగా నాశనమైంది..నౌకాదశం, వైమానిక దళం ఉనికిలో లేవు.. ఇరాన్ యుద్దంలో ఓడిపోయింది.. మిడిల్ ఈస్ట్ లో పెత్తందారు అంతమయ్యాడు.. ఇప్పుడు ఇరాన్ వి కేవలం మాటలే కానీ చేతలు లేవంటూ పోస్ట్ లో రాశారు ట్రంప్. యుద్దం విరమణ ఒప్పందం ఇరాన్ చాలా ఆలస్యం చేసింది అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పోస్టులో చెప్పారు.
మరోవైపు ట్విట్ లో మీడియాపై విరుచుకుపడ్డారు. ఇరాన్, అమెరికా యుద్దానికి సంబందించి మీడియా వాస్తవాలను రాయడం లేదన్నారు. వాస్తవాలను వక్రీకరించి రాస్తున్నారని మండిపడ్డారు. అమెరికా నౌకాదళం యుద్ద చరిత్రలోనే అత్యంత విజయవంతంగా పనిచేస్తోంది..హర్ముజ్ జలసంధిని అమెరికా నౌకాదళ దిగ్భంధించిన విజయంపై ఫేక్ న్యూస్ మీడియా నిరాకరిస్తోందంటూ పోస్ట్ చేశారు. మా అనుమతి ఉంటే తప్పా ఏదీ లోపలికి వెళ్లలేదు.. బయటికి రాలేదు.. ఇరాన్ వ్యాపారం పూర్తింగా నిలిచిపోయింది.. తమ సైన్యానికి జీతాలు చెల్లించుకోలేని స్థితిలో ఇరాన్ ఉందననారు. ఇరాన్ ఇప్పుడు ఘోరంగా విఫలమైన దేశంగా మారింది.. భారీగా చమురు బయటికి వెళ్తోంది.. అల్లా స్తుతి కలుగుగాక అంటూ ట్వీట్ రాశారు ట్రంప్.
►ALSO READ | పీవోకేలో కుప్పకూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది భద్రతా సిబ్బంది మృతి