
Trigrahi Raja Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయికకు, రాజయోగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా రాజ యోగాలు ఒక వ్యక్తిని ఉన్నత స్థానంలో నిలబెడుతాయి. జూన్ 15వ తేదీన సూర్యుడు వృషభ రాశి నుంచి తన మిత్రుడు బుధుడి రాశి అయిన మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇప్పటికే మిథునంలో బుధుడు ఉన్నాడు. ఆ తర్వాత చంద్రుడు కూడా సూర్యుడు, బుధుడుతో కలిసి మిథునరాశిలో అత్యంత శుభమైన ‘‘త్రిగ్రాహి రాజయోగాన్ని’’ ఏర్పరుస్తున్నాడు. జూన్ 17వ తేదీ ఉదయం 8.13 గంటలకు ఈ యోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా 4 రాశుల వారికి ఇది ఆర్థిక లాభాలు, వృత్తిలో పురోగతి, గౌరవాన్ని తీసుకురాబోతోంది.
1) మిథున రాశి:
మిథున రాశి వారికి రాశిలోనే మూడు గ్రహాల యుతి ఏర్పడుతోంది. దీంతో వీరికి ఎక్కువ ప్రయోజనం ఉండబోతోంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు పెరిగే ఛాన్స్ ఉంది. దీని వల్ల మీ పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారంలో నిలిచిన డబ్బు తిరిగి పొందొచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. పెట్టుబడి విషయంలో ఈ కాలం చాలా లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది.
2) సింహ రాశి:
సింహ రాశి వారికి 11వ ఇంటిలో సూర్య, చంద్ర, బుధులు యుతి చెందుతున్నారు. ఇది లాభ స్థానంగా పిలిచే 11వ రాశిలో ఏర్పడుతుండటం వల్ల మీ ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. మీ కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. అన్నలు, అక్కాచెల్లెల్ల నుంచి మద్దతు లభిస్తుంది. పాత కోరికలు నెరవేరవచ్చు.
3) కన్యా రాశి:
కన్యా రాశి వారికి దశమ స్థానంలో ఈ గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దశమ స్థానాన్ని కర్మ స్థానంగా పిలుస్తారు. ఇది వారి వృత్తికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు, బాధ్యతలు పెరుగొచ్చు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో ఉన్న వారికి మంచి డీల్స్ వస్తాయి. ఈ సమయంలో జరిగే ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే, మీకే అనుకూలంగా తీర్పు రావోచ్చు.
4) తులా రాశి:
తులా రాశి వారికి భాగ్య స్థానమైన 9వ స్థానంలో ఈ కలయిక జరుగుతోంది. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి రావొచ్చు. నెలల తరబడి నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఏదైనా ఆలయ సందర్శన, వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ సమయం విద్యార్థులకు బాగుంటుంది. పోటీ పరీక్షల్లో గొప్ప విజయం సాధించొచ్చు.