
గాడ్ ఆఫ్ మాసెస్.. ఈ ట్యాగ్ కి అర్హత ఉన్న ఏకైక టాలీవుడ్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ మాత్రమే. అసలు మాస్ అంటే బాలయ్య.. బాలయ్య అంటే మాస్. టాలీవుడ్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలయ్య. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే మాస్ సినిమా అంటే ఎలా ఉంటుందో.. ముద్దుల మావయ్యతో మాస్ హిట్ అందుకున్న బాలయ్య, లారీ డ్రైవర్ తో మాస్ కి పూనకాలు తెప్పించి సమరసింహారెడ్డితో ట్రెండ్ సెట్టర్ మారి గాడ్ ఆఫ్ మాస్ గా మారారు. అప్పటి నుంచి బాలయ్యలోని మాస్ హీరో ఆడియెన్స్‌ను అలరిస్తునే ఉన్నాడు.
దర్శకులు బాలయ్య కోసం రాసుకున్న మాస్ కథలు ఎన్నెన్నో. అయితే కొందరు హీరోలకు మాస్ అంటే ఒక లిమిట్ ఉంటుంది. మాస్ సినిమాలు ఇక చాలు బాబు అనేలా ఉంటుంది. కానీ బాలయ్య విషయంలో అలా కాదు. ఇంతకంటే మాస్ ఏం చూపిస్తారులే అనుకునేలోపే.. మాస్ కా బాప్ లాంటి సినిమా చేయడం బాలయ్య స్టైల్. సింహా, లెజెండ్, అఖండ లాంటి సినిమాల్లో బాలయ్యలోని కొత్త మాస్ హీరోని చూపించాడు బోయపాటి. మరి ఇంతకంటే మాస్ ఇంకేం ఉంటుంది అనుకుంటే.. వీరసింహారెడ్డిలో బాలయ్య చేసిన మాస్ తాండవానికి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇక డాకు మహారాజ్ అయితే నెక్స్ట్ లెవల్ ఆఫ్ మాస్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. డేకేడ్ బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే ఇప్పటికి దాకు మహారాజ్ అనే చెప్పాలి. ఇక బాలయ్య వింటేజ్ మాస్ మొత్తం చూపించారులే అనుకునే టైమ్ లో బాలయ్య మాస్ దాహం మాత్రం ఇప్పట్లో తీరేది కాదని సరికొత్త మాస్ ని పరిచయం చేసాడు దర్శకుడు గోపిచంద్ మలినేని. లేటెస్ట్‌గా వచ్చిన ఎన్బీకె 111 టీజర్ చూస్తే.. ఈ విషయం అర్థమవుతుంది. ఈసారి వింటేజ్ బాలయ్యను కాకుండా.. న్యూ ఏజ్ బాలయ్యను చూపించాడు. ఈ టీజర్ చూస్తే.. స్టైలిష్ లుక్‌తో బాలకృష్ణ మాస్‌ను ‘జెన్-జీ’ ట్రెండ్‌కు తగ్గట్టుగా ప్రెజెంట్ చేయబోతున్నాడు గోపీచంద్. దానికి తోడు.. బాలయ్య అంటే ఊగిపోయే తమన్, మరోసారి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పూనకాలు తెప్పించాడు. ఏదేమైనా.. గాడ్ ఆఫ్ మాసెస్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!