
‘మార్క్ ఆంటోనీ’, ‘మద గజ రాజా’ వంటి వరుస సక్సెస్‌లతో జోరు మీదున్న యాక్షన్ హీరో విశాల్, తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విశాల్ కేవలం హీరోగానే కాకుండా, మొదటిసారి మెగాఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘మకుటం’. టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ బ్యానర్‌లో 99వ మైల్‌స్టోన్ చిత్రంగా, స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. రవి అరసు అందించిన పవర్‌ఫుల్ లైన్ తో రూపొందిన ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయింది.
టీజర్ ప్రారంభంలోనే మండుతున్న శవం నుంచి హీరో సిగరెట్ వెలిగించుకుంటూ ఇచ్చే ఇంట్రడక్షన్ సీన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ఈ సినిమాలో విశాల్ ఏకంగా మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించి తన నటనతో విశ్వరూపం చూపించబోతున్నట్లు స్పష్టమైంది. కేవలం హీరోగానే కాకుండా ఒక స్టైలిష్ డైరెక్టర్‌గా కూడా విశాల్ తన మేకింగ్ స్కిల్స్‌తో అదరగొట్టాడు. టీజర్‌లోని విజువల్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్ట్రెస్ అంజలి మునుపెన్నడూ చూడని ఒక వినూత్నమైన మాస్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతోంది. టీజర్‌లో ఆమె లుక్, ప్రెజెన్షన్ ఫ్యాన్స్‌కు సరికొత్త సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. విశాల్ సరసన దుషార విజయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తంబి రామయ్య, అర్జై తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేయగా.. రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ అత్యంత స్టైలిష్ విజువల్స్ అందించింది. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు, జి. దురైరాజ్ ప్రొడక్షన్ డిజైన్ చూసుకున్నారు. వాసుకి భాస్కర్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. మొత్తం మీద విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ‘మకుటం’ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.